Breaking News

కౌన్సిల్ రద్దు నుంచి వెనక్కి తగ్గిన జగన్ సర్కార్

23 rd Nov 2021, UTC

మూడు రాజధానుల బిల్లులను వెనక్కి తీసుకున్న జగన్ సర్కార్ తాజాగా శాసనమండలి రద్దు చేయాలంటూ గతంలో చేసిన తీర్మానాన్ని కూడా వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి  మంగళవారం అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.  కేంద్రం నుంచి నిర్ణయం రాకపోవడంతో శాసనమండలి రద్దు తీర్మానాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు బుగ్గన వెల్లడించారు

 రాజ్యాంగంలోని 168 అధికరణ కింద 1958లో శాసన మండలిని ఏర్పాటు చేశారన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో శాసన మండలిని రద్దు చేశారన్నారు. తిరిగి 2006లో మండలిని వైఎస్ రాజశేఖర్ రెడ్డి పునరుద్ధరించారని ఆయన తెలిపారు.  ప్రజాప్రతినిధుల నుంచి ఎన్నుకోబడిన మండలి సుప్రీం అయినప్పటికీ దిగువ సభకు సూచనలు చేయాల్సి ఉందన్నారు. అన్ని వర్గాల నుంచి సభ్యులు వచ్చిన దృష్ట్యా సందిగ్ధతకు తెరదించుతూ శాసన మండలిని కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. కౌన్సిల్ రద్దు నిర్ణయాన్ని విరమించుకుంటూ తీర్మానం చేస్తున్నామని మంత్రి బుగ్గన తెలిపారు. 

జనవరి 27, 2020న శాసన మండలిని రద్దు చేయాల్సిందిగా ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది. అనంతరం దానిని కేంద్రానికి పంపింది. అయితే దాదాపు 22 నెలలుగా కేంద్రం వద్దే ఈ తీర్మానం వుండిపోవడం.. ఎలాంటి నిర్ణయం వెలువడకపోవడంతో జగన్ ప్రభుత్వం కౌన్సిల్ రద్దు నుంచి వెనక్కి తగ్గింది. 

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox