Breaking News

విశాఖ రాజధాని విషయమై జగన్ కొత్త మాట..!

17 th Oct 2020, UTC
విశాఖ రాజధాని విషయమై జగన్ కొత్త మాట..!

ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో ఉన్నంత కన్ఫ్యూషన్ మరే ఇతర రాజధాని విషయం లోను ఉండి ఉండదు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్ మూడు రాజధానుల అంశం ప్రతిపాదించినప్పటినుంచి ప్రతిపక్షం వైసీపీ పార్టీ పై రాళ్లు రువ్వుతునే ఉంది. మరో వైపు కొందరు నేతలు ఈ కేసు కోర్టులో నలుగుతూ ఉండగానే రాజధానిని విశాఖకి తరలించలేరంటూ ప్రచారం చేస్తున్నారు. ఈ నేపధ్యంలో జగన్ చేసిన వ్యాఖ్యలు మూడు రాజధానులను కోరుకుంటున్న వారికి కొత్త ఉత్సాహాన్ని నింపనున్నాయి.

ఇటీవల విజయవాడ కనకదుర్గమ్మ వారి ఫ్లై ఓవర్ వంతెన ప్రారంభం సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో విశాఖ రాజధాని ప్రస్తావనను తీసుకొచ్చారు. విశాఖకు కొత్త రహదారి తీసుకురావాలని కోరారు. విశాఖ నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వరకూ ఓ ఐదు లైన్ల రహదారిని తీసుకురావాలన్నారు. విశాఖ నగరానికి ఈ రహదారులు ఆవశ్యకమని చెప్పుకొచ్చారు.

ఓ వైపు రాజధాని విషయంలో వైసీపీ వెనక్కి తగ్గింది అని టీడీపీ నేతలు చేస్తున్న ప్రచారానికి సీఎం జగన్ గట్టి కౌంటర్ నే ఇచ్చారు. ఈ వ్యాఖ్యలతో మూడు రాజధానులను కోరుకునే వారికి సీఎం జగన్ కొత్త ఆశని కల్పించారని పలువురు భావిస్తున్నారు. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox