ఆంధ్ర ప్రదేశ్ : 48 గంటల్లో పదవులకు రాజీనామా చేసి దమ్ముంటే మళ్ళీ ఎన్నికల్లో నిలబడాలని
చంద్రబాబు నాయుడు సీఎం జగన్ కు సవాల్ విసిరినా సంగతి తెలిసిందే. అయితే, ఈ విషయమై వైసీపీ నేతల నుంచి కూడా చంద్రబాబు నాయుడి కి సవాళ్లు ఎదురయ్యాయి. చంద్రబాబునే ముందు గా రాజీనామా చేయాలంటూ సవాల్ విసిరారు.
ఈ విషయమై వైసీపీ ఎమ్మెల్యే రోజా స్పందించారు. నలభై గంటల గడువు అంటూ సవాల్ విసిరి. ఆ తరువాత, చంద్రబాబు నాయుడు తోక ముడిచి హైదరాబాద్ కు పారిపోయారని ఎమ్మెల్యే రోజా ధ్వజమెత్తారు. జగన్ దమ్ము ఏంటో సోనియా గాంధీ ని అడిగితె తెలుస్తుందని అన్నారు. చంద్రబాబు రాజీనామా చేస్తారని తాము భావించామని, కానీ, ఆయన జూమ్ లో డాన్స్ లు చేస్తున్నారని రోజా ఎద్దేవా చేసారు. చంద్రబాబు వెంట అటు ప్రజలు, ఇటు ఎమ్మెల్యేలు ఎవరులేరని రోజా అన్నారు.
మూడు రాజధానుల నిర్ణయానికి ప్రజలంతా సమ్మతించారని, న్యాయస్థానం కూడా త్వరలోనే ఆశీర్వదిస్తుందని భావిస్తున్నామని అన్నారు. లోకేశ్ ను సీఎం చేయాలనే ఆలోచన వచ్చినప్పటి నుంచి చంద్రబాబు బుర్ర పని చేయడం మానేసిందని రోజా విమర్శించారు. జగన్ తరహా లో లోకేష్ గెలవడం అసాధ్యమని అన్నారు. చంద్రబాబుని అమరావతి రైతులు నమ్మారని, వారిని చంద్రబాబు నట్టేట ముంచారని విమర్శల వర్షం కురిపించారు.
మరిన్ని వార్తలు చదవండి : మోసగాళ్లు అధికారంలోకి వస్తే అన్నీ మోసాలే:చంద్రబాబు నాయుడు