Breaking News

సీఎం అయినప్పటినుంచి జగన్ చేసింది నాలుగు పనులే..!

24 th Oct 2020, UTC

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్ పై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శల వర్షం కురిపించారు. వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రానికి సీఎం అయినప్పటినుంచి  విధ్వంసాలు, అవినీతి, అక్రమ కేసులు, కూల్చటాలే  పని గా పెట్టుకున్నారని విమర్శించారు. ఇటీవల.. అచ్చెన్నాయుడిని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడి గా చంద్రబాబు నియమించిన సంగతి విదితమే. ఈ నేపధ్యం లో శనివారం మీడియా తో మాట్లాడిన అచ్చెన్నాయుడు సీఎం జగన్ పై విమర్శల వర్షం కురిపించారు.

గీతం యూనివర్సిటీ అక్రమ నిర్మాణాలు చేపట్టిన నేపధ్యం లో. ప్రహరీ గోడలను రెవెన్యూ శాఖ కూల్చివేసిన సంగతి విదితమే. అయితే. ఈ ఘటనను తీవ్రం గా ఖండిస్తున్నామని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. గతం లో ఉత్తరాంధ్ర లో సరైన విద్య అవకాశాలు లేక విద్యార్థులు ఇతర ప్రాంతాలకు వెళ్లి చదువుకున్నారని గుర్తు చేసారు. అలాంటి తరుణం లో గాంధీ స్ఫూర్తి తో గీతం యూనివర్సిటీ ఏర్పడిందన్నారు.రాష్ట్రం, దేశంలోని వేల మంది విద్యార్థులు. ఈ యూనివర్సిటీ లో చదువుకుని గొప్ప స్థానాలకు చేరుకున్నారని గుర్తు చేసారు.

కరోనా నేపధ్యం లో ఎన్నో సంస్థలు ఉద్యోగాల్లోంచి తీసేసినా. గీతం మాత్రం ఉద్యోగ భద్రతా కల్పించిందన్నారు. అలాంటి యూనివర్సిటీ పై ప్రభుత్వం కుట్ర పన్నిందన్నారు.జగన్ లాగా భారతీ సిమెంటు కంపెనీ పెట్టి నీరు, భూమి దోచుకోవడానికి గీతం సంస్థ పెట్టలేదని మండి పడ్డారు. అర్ధరాత్రి గోడలు కూల్చాల్సిన అవసరం ఏమొచ్చిందన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ఆదాయం గురించి పట్టించుకోకుండా కూల్చడం పై దృష్టి సారించడమేమిటన్నారు. పోలీసులు లను పెట్టి ఎవరు లేని సమయం లో గోడలు కూల్చడమేమిటన్నారు.. కనబడిన భూములను కబ్జా చేసుకుంటూ ప్రభుత్వం రాష్ట్రాన్ని దోచుకుంటోందన్నారు.. గీతం యూనివర్సిటీ ఎన్నో సామాజిక కార్యక్రమాలకు కూడా నెలవు గా ఉందన్నారు. హుద్ హుద్ సమయంలో ప్రజలు తలదాచుకున్నారు. కరోనాతో విశాఖ ప్రజలు భయపడుతుంటే మొదటి సారి వాలంటీర్ గా కోవిడ్ సేవలు అందించారు అని అచ్చెన్నాయుడు చెప్పుకొచ్చారు. మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తలు చదవండి 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox