ఆంధ్ర ప్రదేశ్ : ప్రతిపక్షనేత
చంద్రబాబుపై ఎంపీ విజయసాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మనవాళ్లు బ్రీఫుడు మీ అన్న వాయిస్ మీదేనని పసిపిల్లలూ గుర్తుపట్టారు. నా ఫోన్ ట్యాప్ చేసే అధికారం ఎవరిచ్చారని మీడియా ఇంటర్వ్యూల్లో గద్దించిన సంగతి ఎవరూ మరిచి పోలేదంటూ ట్విట్టర్ వేదికగా చంద్రబాబుకు చురకలు అంటించారు. ఇజ్రాయిల్ ట్యాపింగ్ మిషన్ల కోసం కింద మీదా పడ్డట్టు వికీలీక్స్ బయట పెట్టింది. దొంగే దొంగని అరిచినట్టు లేదూ? అంటూ ఎంపీ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు.