ఏపీ :
ఏపీలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ వంద కోట్లు లంచం ఇచ్చి బెయిల్ తెచ్చుకొని న్యాయ వ్యవస్థని బ్రష్టు పట్టించాలని ప్రయత్నించి సీబీఐకి అడ్డంగా దొరికిపోయిన గాలి దొంగలు, 16 నెలలు చంచల్ గూడా ఊచలు లెక్కపెట్టిన గజ దొంగలు ఇప్పుడు న్యాయవాదుల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు. సాయిరెడ్డి గారు, ఒక దొంగ పోలీస్‌పై నిఘా పెట్టినట్టు ఉంది మీ జగన్ రెడ్డి గారి ట్యాపింగ్ తంతు అని అయ్యన్న ట్వీట్ చేశారు.
రమేష్ హాస్పిటల్ వేల ప్రాణాలు కాపాడింది.రమేష్ హాస్పిటల్ 20 వేలకు పైగా శస్త్ర చికిత్సలు చేసి ప్రాణాలు కాపాడిందని మాజీ మంత్రి దేవినేని ఉమ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ట్విట్టర్ పోస్టు పెట్టినందుకు హీరో రామ్ పోతినేనికి బెదిరిస్తారా? అని ప్రశ్నించారు. 32 ఏళ్లుగా 2 వేలకు పైగా సిబ్బందితో నెలకి 20వేల ఓపీ, 1500 పైగా ఇన్ పేషెంట్స్‌కి సేవలు. 1,25,000 పైగా cath, 20 వేలకు పైగా శస్త్ర చికిత్సలు చేసి ప్రాణాలు కాపాడిన రమేష్ హాస్పిటల్స్. ట్విట్టర్లో పోస్ట్ పెట్టిన రామ్‌కు బెదిరింపులా? ఎంతో మందికి ప్రాణదాత రమేష్‌ను అరెస్టు చేసేందుకు ఎందుకంత ఉత్సాహం అంటూ సీఎం జగన్‌ను ఉద్దేశించి దేవినేని ఉమ ట్వీట్ చేశారు.
మరిన్ని వార్తలు చదవండి : టీడీపీ నేతలు చవకబారు ఆరోపణలు చేస్తున్నారు :ఎమ్మెల్యే జోగి రమేష్