Breaking News

ఏపీలో కోవిడ్‌-19 ఆస్పత్రుల సంఖ్య పెంపు

21 st Aug 2020, UTC
ఏపీలో కోవిడ్‌-19 ఆస్పత్రుల సంఖ్య పెంపు
 
ఆంధ్రప్రదేశ్  :ఏపీలో కోవిడ్‌-19 ఆస్పత్రుల సంఖ్యను 138 నుంచి 287కు పెంచామని,స్పెషలిస్టులను, డాక్టర్లను వీలైనంత త్వరగా అందుబాటులో ఉంచాలని  సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కోవిడ్‌-19 పై సమీక్షా సమావేశం  సందర్బంగా ఆయన మాట్లాడుతూ  తాత్కాలికంగా నియమిస్తున్న పారిశుద్ధ్య సిబ్బందికి జీతాలు పెంచాలని  ఆదేశించారు.
 
ప్రస్తుతం ఉన్న 287 ఆస్పత్రుల్లో అన్ని రకాల సదుపాయాలు, సరైన సంఖ్యలో వైద్యులు, సిబ్బంది సంతృప్త స్థాయిలో ఉండాలని, నిరంతరం ఆస్పత్రుల్లో ప్రమాణాలను పర్యవేక్షించాలని చెప్పారు.  కాల్‌ సెంటర్‌లతో పాటు ఆస్పత్రుల్లోని హెల్ప్‌ డెస్క్‌లు సమర్థవంతంగా పనిచేయాలన్నారు. అందిస్తున్న సేవలకు అనుగుణంగా కోవిడ్‌ ఆస్పత్రులకు రేటింగ్‌ ఇవ్వాలన్నారు.చికిత్స తీసుకుంటున్న వారికి మంచి భోజనం అందించాలి, హోంక్వారంటైన్‌లో ఉన్నవారికి సేవలు సక్రమంగా అందాలి. మందులు ఇవ్వడం, చికిత్స అందించడం, వారి సందేహాలకు ఎప్పటికప్పుడు సమాధానాలు ఇచ్చే వ్యవస్థ సక్రమంగా ఉండాలి. ఆరోగ్యశ్రీ కింద వచ్చే పేషెంట్లకు అత్యుత్తమ సేవలు అందాలి. మనం ఆస్పత్రులకు వెళ్లినప్పుడు ఎలాంటి సేవలు కోరుకుంటామో ఆ విధానాలు కచ్చితంగా అమలు కావాలని సూచించారు.
 
రిఫరల్‌ ప్రోటోకాల్‌ చాలా స్పష్టంగా ఉండాలి. విలేజ్, వార్డు క్లినిక్స్‌ నుంచి ఈ ప్రోటోకాల్‌ అమలు జరగాలి. ఆరోగ్యశ్రీ సేవల సమాచారం తెలుసుకునేందకు, ఏవైనా ఫిర్యాదులు చేసేందుకు ఒక కాల్‌సెంటర్‌ ఉండాలి. ఈనంబర్‌ను అన్ని ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో బోర్డుపై ఉంచాలి. పేషెంట్‌ను ట్రీట్‌చేయకుండానే అవసరంలేకుండా రిఫర్‌ చేస్తే కచ్చితంగా చర్యలు తీసుకుంటామనే విషయాన్ని గట్టిగా చెప్పాలి. ఆరోగ్య ఆసరా పనితీరును కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. డెలివరీ అవగానే తల్లికి డబ్బు ఇచ్చే కార్యక్రమం అమలు ఎలా జరుగుతుందో పరిశీలించాలి. ఆస్పత్రి నుంచి తల్లి, బిడ్డ డిశ్చార్జి అవుతున్నప్పుడే డబ్బులు వారి అక్కౌంట్లో పడాలి’ అని సీఎం జగన్‌ ఆదేశించారు. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox