ఆంధ్ర ప్రదేశ్ : విశాఖపట్నంలోని ఒక ఇంట్లో దొరికిన పుర్రెతో స్థానికులు భయాందోళనలకు లోనయ్యారు. స్దానిక రెల్లివీధిలో నివసిస్తున్న రావులపూడి రాజు (20) అనే యువకుడు ఆదివారం ఉదయం ప్లాస్టిక్ కవర్లో చుట్టిన పుర్రెను తాను నివాసం ఉంటున్న ఇంటి సందులో ఉంచాడు. రాజు ఇంటికి సమీపంలో ఉన్న సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి ఉదయం సందులో ఉన్న ప్లాస్టిక్ కవర్ నుంచి దుర్వాసన రావడంతో ఇంటి నుంచి వెలుపలికి వచ్చి కవర్ను కదలించడంతో అందులో నుంచి పుర్రె వెలుపలికి వచ్చింది. దీంతో పెద్దగా కేకలు వేయడంతో రాజు వచ్చి పుర్రెతో సహా ప్లాస్టిక్ కవర్ను ఇంట్లోకి తీసుకువెళ్లిపోయాడు. స్థానికులు విషయాన్ని పోలీసులకు చేరవేయడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
ఈ పుర్రెను పరిశీలించిన తరువాత ఆంధ్ర వైద్య కళాశాల అనాటమీ విభాగంలో వైద్య విద్యార్థులు పరిశోధనలు జరిపిన ఓ వ్యక్తి పుర్రెగా పోలీసులు గుర్తించారు. అనాటమీ విభాగం వద్ద పరిశోధనలు పూర్తయిన శరీరాలను వేసే ప్రదేశం నుంచి దాన్ని తీసుకువచ్చినట్టు తెలుసుకున్నారు. పుర్రెను 14 రోజుల క్రితమే రాజు తీసుకువచ్చి ఇంట్లో ఉంచి పూజలు చేస్తున్నాడు. తనకు శివుడు అత్యంత ప్రీతపాత్రమైన దేవుడని, పుర్రెను పూజిస్తే మంచి జరుగుతుందని ఎవరో చెప్పడంతో ఈ విధంగా చేస్తున్నానని, పుర్రెను కాల్చుకు తినలేదని రాజు పోలీసుల విచారణలో తెలిపాడు. రాజును అదుపులోకి తీసుకున్న పోలీసులు పుర్రెను స్వాధీనం చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.
రాజు తండ్రి ఐదేళ్ల కిందట అనారోగ్యంతో మరణించడంతో అప్పటి నుంచి చెడు వ్యసనాలకులోనై చిల్లరదొంగతనాలకు పాల్పడడంతో పాటు గంజాయి, మత్తుమందులకు అలవాటుపడి ఇష్టానుసారం ప్రవర్తించడం మొదలుపెట్టాడు. కొడుకు ప్రవర్తన నచ్చకపోవడంతో రాజు తల్లి పీఎంపాలెం, వాంబేకాలనీకి వెళ్లిపోయి అక్కడ నివసిస్తోంది. అతడి ప్రవర్తనకు సంబంధించి పలు స్టేషన్లలో కేసులు నమోదైనట్టు తెలుస్తోంది. మరిన్ని వార్తలు చదవండి : విశాఖ లో ప్రమాదం.. ఏడుగురు మృతి..!

Read latest ఆంధ్రప్రదేశ్ న్యూస్ | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
26 Feb 2021
25 Feb 2021
27 Feb 2021
27 Feb 2021