Breaking News

ఎల్జీ పాలిమర్స్ ప్రమాదానికి నిర్లక్ష్యమే కారణం..!

07 th Jul 2020, UTC

విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్‌ గ్యాస్ లీకేజీ దుర్ఘటనపై ఏపీ ప్రభుత్వం నియమించిన హైపవర్‌ కమిటీ సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి తుది నివేదికను సమర్పించింది. . యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల స్టైరిన్ ట్యాంకుల్లో ఉష్ణోగ్రత పెరిగి ప్రమాదానికి దారితీసిందని కమిటీ నివేదికలో పేర్కొంది. సీఎంకు నివేదిక సమర్పించిన అనంతరం కమిటీ చైర్మన్‌ నీరబ్‌ కుమార్‌ మీడియాతో మాట్లాడుతూ.. విశాఖలో జరిగింది కేవలం గ్యాస్‌ లీకేజీ మాత్రమే కాదని స్టైరిన్‌ కూడా పెద్ద ఎత్తున విడుదలైందని తెలిపారు. ట్యాంకుల్లో ఉష్ణోగ్రతలను కాపాడం చాలా కీలకమైన విషయమని, అయితే ఎల్జీ పాలిమర్స్‌ కంపెనీ ఈ విషయంలో తీవ్ర తప్పిదం చేసిందని వెల్లడించారు. 2019 డిసెంబర్‌లో రిఫ్రిజిరేషన్‌ పైపులు మార్చారని, దీనివల్ల కూలింగ్ సిస్టమ్ పూర్తిగా దెబ్బతిన్నట్లు గుర్తించామని చెప్పారు.

ఫ్యాక్టరీలో ఉష్టోగ్రత కొలిచే పరికరాన్ని ట్యాంకు కింది భాగంలో అమర్చారని, దీని వల్ల ట్యాంకు మధ్య భాగంలో పైభాగంలో ఎంత టెంపరేచర్ నమోదవుతోందో తెలుసుకోలేకపోయారని నీరబ్ కుమార్ చెప్పారు. స్టైరిన్ పాలిమరైజేషన్ అవుతున్న సంగతి డిసెంబర్‌లోనే రికార్డయిందని, కానీ దీన్ని వారు హెచ్చరికగా భావించలేదని తెలిపారు. ఓ వైపు ట్యాంకుల్లో ఉష్ణోగ్రత పెరగడం, స్టైరిన్ బాయిలింగ్ పాయింట్‌కు చేరడం, ఆవిరి రూపంలో బయటకు వెళ్లడంతో ప్రమాదం జరిగిందని వివరించారు. స్టైరిన్ ఆవిరి రూపంలో బయటకు వెళ్లడానికి కారణాలేంటో పూర్తిగా డయాగ్రామ్ రూపంలో నివేదికలో పొందుపరిచినట్లు వెల్లడించారు.

యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే స్టైరిన్ ట్యాంకుల్లో ఉష్ణోగ్రత పెరిగి ప్రమాదం సంభవించిందని నీరబ్ కుమార్ వెల్లడించారు. ప్రమాదం జరిగిన తరువాత కూడా ఎల్జీ పాలిమర్స్ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని తెలిపారు. ఫ్యాక్టరీలో 36 చోట్ల అలారం పాయింట్లున్నాయని, అయితే ప్రమాదం జరిగినా సైరన్‌ మోగించలేదని వెల్లడించారు. ఎల్జీ పాలిమర్స్‌లో అలారం ఆన్ చేయకపోవడం అతి పెద్ద నిర్లక్ష్యమని చెప్పారు. స్టైరిన్‌ను అదుపు చేసేందుకు కావాల్సినరసాయనాలు పూర్తిస్థాయిలో ఫ్యాక్టరీలో లేవని, ఒకవేళ ఇలాంటి రసాయనాలు అందుబాటులో ఉంటే స్టైరిన్‌ను త్వరగా న్యూట్రలైజ్ చేసే అవకాశం ఉండేదన్నారు. ఈ రసాయనాలను గుజరాత్‌ నుంచి తెప్పించాల్సి వచ్చిందని.. అప్పటికే ట్యాంకుల్లో టెంపరేచర్ పూర్తిగా పెరిగిపోయిందని వివరించారు.

. ఎల్జీ పాలిమర్స్‌ వంటి ప్రమాదకరమైన రసాయనాలతో కూడిన ఫ్యాక్టరీ జనావాసాల్లో ఉండేందుకు వీల్లేదని నివేదికలో స్పష్టంగా చెప్పామని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ప్రమాదాలపై అధ్యయనం చేసి ఇలాంటి ఫ్యాక్టరీలు ఎక్కడ ఉండాలనే దానిపై సూచనలు చేసినట్లు తెలిపారు. చాలా ఫ్యాక్టరీల్లో స్టైరిన్‌లాంటి కెమికల్స్ వాడుతుంటారని, ఇలాంటి ఫ్యాక్టరీల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నిబంధనలు సూచించినట్లు వివరించారు.  ప్రమాదకర రసాయనాల ఫ్యాక్టరీలను జనావాసాల కంటే దూరంగా ఏర్పాటుచేయాలని, మాస్టర్‌ ప్లాన్‌ తయారు చేసే సమయంలోనే ఈ జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఎల్జీ పాలిమర్స్‌ను వేరే ప్రాంతానికి తరలించడం మంచిదనేది తమ అభిప్రాయమని ఆయన చెప్పారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox