Breaking News

మూడు రాజధానుల విషయమై.. హై కోర్ట్ స్టే

04 th Aug 2020, UTC
మూడు రాజధానుల విషయమై.. హై కోర్ట్ స్టే

ఆంధ్రప్రదేశ్ : మూడు రాజధానుల విషయమై, రాజధాని తరలింపుకి,సీఆర్డీఏ బిల్లు రద్దుకి గవర్నర్ ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. అయితే, గవర్నర్ ఆమోదించడమై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. రాజధాని రైతు పరిరక్షణ సంఘం రాజధాని తరలింపు విషయమై పునరాలోచించాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
              విచారణ పూర్తి అయ్యే వరకు రాజధాని తరలింపు పై స్టే ఇవ్వాలని కోరింది. మరో వైపు రైతులు, రాజధాని రైతు పరిరక్షణ సంఘం కూడా నిరసనలు చేపట్టింది. నేడు ఈ విషయమై విచారణ జరిగింది. వికేంద్రీకరణ లో భాగం గా రాజధాని ని విశాఖ కు తరలించాలని భావిస్తున్న సంగతి తెలిసిందే. అయితే,ఆగష్టు 15 లోపు పరిపాలన విభాగాలను తరలించాలని భావించాలని చూస్తున్న సంగతి తెలిసిందే.
            ఈ విషయమై నేడు కోర్టు లో విచారణ జరిగింది. రైతు పరిరక్షణ సమితి వేసిన పిటిషన్ కు రిప్లై కౌంటర్ దాఖలు చేయాలనీ ఏపీ హై కోర్ట్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎపి గవర్నర్ గెజిట్ పై హై కోర్ట్ స్టే విధించింది. రాజధాని తరలింపు పై ప్రస్తుతం స్టే విధించిన కారణం గా తరలింపు సాధ్యపడదు. ఆగష్టు 14 వ తేదీ కి తదుపరి విచారణ వాయిదా వేసింది. ప్రభుత్వం పది రోజులు సమయం అడగడంతో విచారణ ఆగష్టు 14 వ తేదీ కి వాయిదా వేసింది. అయితే అమరావతి తరపు న్యాయవాది ఈ పది రోజుల్లో రాజధానిని తరలిస్తారని ప్రశ్న వేయగా,హై కోర్ట్ జడ్జి రాజధాని తరలింపు పై కూడా స్టే విధిస్తున్నట్లు తెలిపారు. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox