Breaking News

ఏపీలో పరిషత్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

07 th Apr 2021, UTC

ఏపీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల్ని డివిజన్ బెంచ్ కొట్టేసింది. ఈ సమయంలో జోక్యం చేసుకోలేమని ధర్మాసనం చెప్పింది. ఏపీలో పరిషత్ ఎన్నికలు గురువారం నిర్వహించాలని కౌంటింగ్ మాత్రం నిలిపివేయాలని తీర్పు తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకూ ఫలితాలను మాత్రం వెల్లడించొద్దని సూచించింది. సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చే తీర్పుకు లోబడి ఉండాలని ఆదేశించింది. 

ఎస్ఈసీ తరపున లాయర్ వాదనలు వినిపిస్తూ ఓటు హక్కు లేని వర్ల రామయ్య ఎలా పిటిషన్ ఎలా వేస్తారని ప్రశ్నించారు. ఎన్నికల అమలులో మినిమం, మ్యాగ్జిమమ్ ఉండదని, గతంలో పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ఇలాగే జరిగిందని తెలిపారు. పంచాయతీ ఎన్నికలకు ఎన్ని రోజులు కోడ్ అమలు చేశారని ధర్మాసనం ప్రశ్నించగా, 24 రోజుల సమయం తర్వాత ఎన్నికలు జరిపామని ఎస్ఈసీ తెలిపింది. అన్ని రోజులు కోడ్ అమలు చేసినట్లే కదా అని వ్యాఖ్యానించింది. 

టీడీపీ నేత వర్ల రామయ్య తరపున లాయర్ వాదనలు వినిపించారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పిటిషన్ వేయొచ్చని, సుప్రీం కోర్టు నాలుగు వారాలు కోడ్ అమలు చేయాలని స్పష్టం చేసిన విషయాన్ని వివరించారు. సుప్రీం కోర్టు ఆదేశాలను ఎస్ఈసీ తెలుసుకోవాలన్నారు. అన్ని వాదనలు విన్న కోర్టు పోలింగ్‌కు లైన్ క్లియర్ చేసింది.

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ గురువారం జరగాల్సి ఉండగా, మంగళవారం హైకోర్టు సింగిల్ బెంచ్ స్టే ఇచ్చింది. హైకోర్టులో విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు 4 వారాల ఎన్నికల కోడ్ విధించలేదని పిటిషనర్లు వివరించారు. 7 రోజుల్లో ఎలా ఎన్నికలు నిర్వహిస్తారని ప్రశ్నించారు. ఈ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు ఎన్నికల నోటిఫికేషన్‌పై స్టే విధించింది. మంగళవారం సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును ఎస్ఈసీ డివిజన్ బెంచ్‌లో సవాల్ చేసింది

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox