ఆంధ్ర ప్రదేశ్ : పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు బిల్లులపై హై కోర్ట్ స్టే విధించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయమై ఆంధ్ర ప్రదేశ్ హై కోర్ట్ విచారణ జరిపింది. ఈ బిల్లులపై ఉన్న స్టేను మరికొంత కాలం పొడిగిస్తున్నట్లు హై కోర్ట్ తీర్పునిచ్చింది. ఆగష్టు 27 వరకు ఈ బిల్లులపై స్టే కొనసాగుతుందని హై కోర్ట్ ఆదేశించింది. అయితే ప్రభుత్వం తరపు న్యాయవాది రాకేష్ త్రివేది కేసు వాయిదా వేసిన పర్లేదు కానీ స్టేని మాత్రం పొడిగించవద్దని కోరారు.
అయితే అందుకు బదులుగా "ఇపుడు కరోనా ముప్పు నెలకొన్న నేపధ్యంలో అంత అవసరం ఏమొచ్చిందని " హై కోర్ట్ తిరిగి ప్రశ్నించింది. అయితే ప్రభుత్వం విధులు నిర్వర్తించాల్సి ఉందని న్యాయవాది రాకేష్ బదులిచ్చారు. రాజధాని విషయమై కేసులు ఓ కొలిక్కి వచ్చిన తరువాతనే రాజధాని శంకుస్థాపన చేయాలనీ జగన్ సర్కార్ యోచిస్తున్న సంగతి తెలిసిందే. ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ విషయాన్నీ స్పష్టం చేసారు.
రాజధాని విషయంలో సర్వ హక్కులు రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. దీని తాలూకు అఫిడవిట్ ను రాష్ట్ర ప్రభుత్వం హై కోర్ట్ కు సమర్పించింది. రాజధానితో సహా వివిధ అభివృద్ధి ప్రణాళికలు, ప్రాజెక్టులను సమీక్షించే విస్తృత అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందని అందులో వివరించింది. వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు చట్టాల ప్రకారం రాజధాని తరలింపుపై పిటిషనర్ చెబుతున్న అభ్యంతరాలు పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని తెలిపింది. మరోవైపు ప్రత్యేక హోదా గురించి ప్రభుత్వం తరపు న్యాయవాది ప్రస్తావించారు. ఏపీకి ప్రత్యేక హోదా రానంత వరకు విభజన పూర్తి కానట్లే అని హోదా గురించి కూడా ప్రతి రోజు మీటింగ్ లో అడుగుతూనే ఉన్నామని హోదా అంశం కేంద్రానికి, రాష్ట్రానికి మధ్య అపరిష్కృతి అంశమని ప్రభుత్వం అఫిడవిట్ లో పేర్కొంది.మరిన్ని వార్తలు చదవండి : రెండు నెలలకు పైగా లాక్ డౌన్ వల్ల సాధించింది ఏమిటి? హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ

Read latest ఆంధ్రప్రదేశ్ న్యూస్ | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
01 Mar 2021
01 Mar 2021
03 Mar 2021