Breaking News

ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కు కోటిరూపాయలు ప్రకటించిన హీరో ప్రభాస్

07 th Dec 2021, UTC

ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల సంభవించిన వరదలను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు అందించేందుకు టాలీవుడ్ ముందుకు వస్తోంది. తాజాగా పాన్-ఇండియా  స్టార్ ప్రభాస్   ఏపీ సీఎంరిలీఫ్ ఫండ్ కు  కోటి రూపాయలు విరాళంగా ప్రకటించారు..ఆంధ్రప్రదేశ్‌లో వరదల దృష్ట్యా టాలీవుడ్ స్టార్ నుండి వచ్చిన అతిపెద్ద విరాళం ఇదే. 

కోవిడ్ కష్టాల సమయంలో, ప్రభాస్ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు ఏకంగా కోటి రూపాయలను విరాళంగా ఇచ్చారు. ప్రధానమంత్రి సహాయ నిధికి మరో రూ.3 కోట్లు అందించారు. హైదరాబాద్ వరదల సమయంలో కూడా కోటి రూపాయలు అందించారు. ప్రభాస్  పెద్ద మనసుకు అభిమానులతో పాటు అంతా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox