Breaking News

కట్ చేసిన సగం జీతాలు వడ్డీ తో సహా చెల్లించాల్సిందే..: ఏపి హై కోర్ట్

12 th Aug 2020, UTC

 ఆంధ్ర ప్రదేశ్ : కరోనా మహమ్మారి కారణంగా దేశ, రాష్ట్ర ఆదాయాలకు గండి పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యం లో పలు రాష్ట్రాలు సగం జీతాలు మాత్రమే చెల్లించాయి. తెలుగు రాష్ట్రాలు సైతం సగం జీతాలను సగం పెన్షన్లను చెల్లించాయి. ఈ నేపధ్యంలో ఆంధ్ర ప్రదేశ్ హై కోర్ట్ ప్రభుత్వానికి షాకిచ్చింది. కట్ చేసిన సగం జీతాలను, పెన్షన్లను తిరిగి వడ్డీ తో సహా చెల్లించాలిసిందేనని ఆదేశించింది.

కరోనా, ఆర్ధిక ఇబ్బందుల కారణంగా 50 శాతం మాత్రమే జీతాల చెల్లింపులకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన జీవోలను హైకోర్టు కొట్టి వేసింది. విశాఖ రిటైర్డ్ జడ్జి కామేశ్వరి సగం జీతాల చెలింపు విషయమై హై కోర్ట్ లో పిటిషన్ దాఖలు చేసారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హై కోర్ట్ తాజాగా ఉత్తర్వులు విడుదల చేసింది. లాక్ డౌన్ సమయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ కూడా సగం సగం జీతాలే ఇవ్వడంతో ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్ కూడా అదేబాట పట్టారు. రెండు నెలల పాటు సగం జీతాలనే ఇచ్చారు.

ఆ సమయంలోనే పెన్షనర్లు కోర్టుని ఆశ్రయించారు. అయితే పెన్షన్ ను ఆపడానికి వీలు లేదని న్యాయ నిపుణులు వాదించడంతో ఆ నెల నుంచి మొత్తం జీతాలు, పెన్షన్లు ఇస్తున్నట్లుగా కోర్టుకు తెలిపారు. కానీ రెండు నెలల బకాయిల గురించి మాత్రం ప్రస్తావించలేదు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడ్డాక ఇస్తామని ప్రభుత్వం ప్రకటిస్తోంది. కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎప్పటికి మెరుగుపడుతుందో ఎవరు చెప్పలేని స్థితి నెలకొంది. ఈ లోగ కొంతమంది కోర్టు బాట పట్టారు. ఇప్పుడు బకాయిలతో కలిపి జీతాలు చెల్లించాల్సిందేనని హై కోర్ట్ ఆదేశించింది. రెండు నెలలకు కలిపి ఉద్యోగులకు దాదాపుగా ఐదు వేల కోట్ల వరకూ చెల్లించాల్సి ఉండొచ్చని అధికారులు ఓ అంచనా కు వచ్చారు. మరి ఈ ఆదేశాల విషయమై ప్రభుత్వం ఏమి చేస్తుందో చూడాలి. మరిన్ని వార్తలు చదవండి : చంద్ర‌బాబు అవ‌కాశ‌వాది : ఒమ‌ర్ అబ్దుల్లా

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox