Breaking News

పెళ్లి కొడుక్కి కరోనా.. 500 మందికి టెన్షన్

17 th Aug 2020, UTC

ఆంధ్రప్రదేశ్ :పెళ్లికి ముందు కరోనా టెస్ట్ చేయించుకన్నాడు. అయితే రిజల్ట్ రాకముందే పెళ్లి చేసుకున్నాడు. తరువాత కరోనా నిర్దారణ కావడంతో అందరిలోనూ టెన్షన్ మొదలయింది. విశాఖ జిల్లా కోటవురట్ల మండలం కొడవటిపూడి గ్రామానికి చెందిన 31 ఏళ్ల యువకుడు రంగారెడ్డి జిల్లా నుంచి 20 రోజుల కిందట వచ్చాడు. ఇతనికి కరోనా లక్షణాలు కనిపించడంతో ఈ నెల 5న వీఎల్‌ఎం కిట్‌తో కోవిడ్‌ పరీక్ష చేసి నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి నమూనా పంపించారు.
 
అయితే ఫలితం రాకముందే యువకుడు ఈ నెల 15న రావికమతం గ్రామానికి చెందిన యువతిని వివాహం చేసుకున్నాడు. 16న కరోనా సోకినట్టు నిర్ధారణ కావడంతో అందరిలోనూ  ఆందోళన పెరిగింది. గ్రామంలో చర్చిలో జరిగిన  ఈ యువకుడి వివాహానికి పాస్టరుతో పాటు ఇరువైపులా బంధువులు సుమారు 90 మంది పాల్గొన్నారు. అదే రోజు మధ్యాహ్నం ఇంటి దగ్గర పెట్టిన భోజనాల కార్యక్రమంలో సుమారు 500 మందికి పైగా పాల్గొన్నట్టు గ్రామస్తులు చెబుతున్నారు. ఇపుడు వీరందరూ టెస్టులు చేయించుకుని కరోనా వుందా లేదా అన్నది నిర్దారించుకోవలసి వచ్చిందని వాపోతున్నారు. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox