శ్రీకాకుళం : గురువారం ఉదయం జనావాసాల్లోకి వచ్చిన ఓ భారీ రేట్ స్నేక్ ని గ్రీన్ మెర్సీ రెస్క్యూ టీమ్ కాపాడింది. గురువారం శ్రీకాకుళం మునిసిపల్ కార్పొరేషన్ పరిథి లో చిన్న మండల వీధి అభయాంజనేయ ఆలయం సమీపంలో ఎనిమిది అడుగుల పొడవైన ఒక భారీ రేట్ స్నేక్ హడావిడి చేసింది. ఈ స్నేక్ ని చూసి ప్రజలు భయపడి హడలిపోతున్నారు. గ్రీన్ మెర్సీ రెస్క్యూ టీం గురువారం ఆ రేట్ స్నేక్ ని కాపాడింది..
హఠాత్తుగా జనావాసాల్లోకి ఓ రేట్ స్నేక్ రావడం తో అక్కడి వారు ఈ విషయాన్ని గ్రీన్ మెర్సీ సంస్థ సర్ప సంరక్షణ గస్తీ విభాగానికి తెలియజేసారు. గ్రీన్ మెర్సీ రెస్క్యూ టీం హుటాహుటిన అక్కడకు చేరుకొంది .అప్పటికే ఆ పాము బెదిరిపోయి, అక్కడే నిలిపివుంచిన ఒక స్కూటర్ లోకి దూరి తలదాచుకొంది. రెస్క్యూ టీంకి నేతృత్వం వహించిన గ్రీన్ మెర్సీ సంస్థ సీ. ఈ. ఓ. రమణ మూర్తి చాకచక్యంగా ఆ పాముని పట్టుకొని కాపాడారు. అక్కడి స్థానికులకు ఈ సందర్భంగా పాములపై అవగాహన కల్పిం చారు.1972 వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం పాములు రక్షిత ప్రాణుల జాబితా కిందకు వస్తాయని, ఈ దృష్ట్యా పాములను కాపాడటం నేటి అవసరమని ఆయన వివరించారు. మరిన్ని వార్తలు చదవండి: యనమల గవర్నర్కు లేఖ ఎందుకు రాసారు:శాసనమండలి చీప్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు

Read latest ఆంధ్రప్రదేశ్ న్యూస్ | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox