Breaking News

అనంతపురం జిల్లాలో బంగారం నిధి స్వాధీనం

19 th Aug 2020, UTC
అనంతపురం జిల్లాలో బంగారం నిధి స్వాధీనం

అనంతపురం : అనంతపురం జిల్లాలోని బుక్కరాయ సముద్రంలో పోలీసులు బంగారు నిధిని పట్టుకున్నారు. డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్న నాగలింగ ఇంట్లో పోలీసులు మంగళవారం తవ్వకాలు జరిపి 15 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఒక రివాల్వర్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తవ్వకాల్లో 10 పురాతన ట్రంకు పెట్టెలు లభించాయి. అయితే వీటిని గుప్త నిధులుగా పోలీసులు భావిస్తున్నారు. మీడియాను సైతం పోలీసులు అనుమతించడం లేదు. ట్రెజరీ ఉద్యోగి మనోజ్‌ వద్ద నాగలింగ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఉద్యోగి మనోజ్‌, డ్రైవర్‌ నాగలింగను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మరిన్ని వార్తలు చదవండి : ఏపీ పోలీస్ సురక్ష యాప్..!

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox