ఆంద్రప్రదేశ్ :
చంద్రబాబు త్వరగా కోలుకోవాలంటూ మంత్రులు, ఎమ్మెల్యేలు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు ట్వీట్స్ చేస్తున్నారు. హోంమంత్రి మేకతోటి సుచరిత, మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే రోజాతో పాటూ మరికొందరు ట్వీట్స్ చేశారు. #GetWellSoonCBNపేరుతో ట్వీట్ల మోత మోగిపోయింది.
చంద్రబాబు మూడు రాజధానుల్ని వ్యతిరేకిస్తున్నారు. అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని జగన్ సర్కార్‌ను టార్గెట్ చేస్తున్నారు. అంతేకాదు రాజీనామాలు చేయాలంటూ సవాళ్లు విసిరారు. రాజధాని రెఫరెండంగా ఎన్నికలు వెళదామన్నారు. డెడ్‌లైన్ కూడా పెట్టారు. దీంతో చంద్రబాబుకు వైఎస్సార్సీపీ కౌంటర్ ఇస్తోంది. అందులో భాగంగానే ఈ హ్యాష్ ట్యాగ్‌ను తెరపైకి తీసుకొచ్చారు.