Breaking News

స్టీల్ ప్లాంట్ విషయంలో బీజేపీనే తేడాగా వుంది.. మాజీ మంత్రి గంటా శ్రీనువాసురావు

21 st Feb 2021, UTC

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ కోసం ఏపీలో అన్ని పార్టీలు పోరాడుతున్నా బీజేపీ మాత్రం ప్రజల్లో నమ్మకం కలిగించలేకపోయిందని మాజీ మంత్రి  గంటా శ్రీనువాసురావు అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ  ప్లాంట్‌ పరిరక్షణ కోసం ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం జగన్‌, చంద్రబాబు లేఖలు రాశారని, పవన్‌ ఢిల్లీ వెళ్లి తన వంతు ప్రయత్నం చేశారన్నారు. కానీ, బీజేపీ నేతలు మాత్రం ప్లాంట్ పరిరక్షణ బాధ్యత తీసుకోకుండా కొత్త పల్లవి అందుకుందని విమర్శించారు. ఉరిశిక్షకు ఆదేశాలిచ్చారు. ఇంకా ఉరి తీయలేదన్నట్లుగా బీజేపీ తీరు ఉందని ఎద్దేవా చేశారు. ఇలాగే ఉంటే ప్రజాగ్రహానికి గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు. మిత్రపక్షంగా ఉన్న జనసేన, బీజేపీ పై ఒత్తిడి తీసుకురావాల్సి ఉందన్నారు. కేంద్ర పెద్దలను కలిశామని బీజేపీ నేతలు చెబుతున్నారని, కానీ ఆ పెద్దలు ఏం చెప్పారో చెప్పడం లేదన్నారు.

 రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదాను కోల్పోయాం. విశాఖ రైల్వే జోన్‌ మరుగున పడిపోయింది. ఇంత జరిగిన తర్వాతైనా విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ అంశంపై రాజకీయాలకు అతీతంగా ఒకే మాట మీద నిలబడాల్సిన అవసరం ఉంది. ఒకరిపై మరొకరు ఆరోపణలు, నిందలు వేసుకుంటూ ఉంటే ‘హోదా’ కోల్పోయినట్లే విశాఖ ఉక్కును కూడా పోగొట్టుకుంటాం. ప్రైవేటీకరణను పూర్తిగా అడ్డుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం, బీజేపీ నాయకులు ప్రజలకు నమ్మకం కల్పించలేకపోతున్నారు. అందుకు బాధ్యత తీసుకుంటామని ఏ ఒక్క నేతా కచ్చితంగా చెప్పలేకపోతున్నారు. తెలుగువారి ఆత్మగౌరవానికి సంబంధించిన విశాఖ ఉక్కుపై రాజకీయ నాయకులే కాకుండా సినీ ప్రముఖులు, క్రీడాకారులు కూడా స్పందించాలి అని గంటా శ్రీనివాస్‌ కోరారు.

రాజకీయాలకు అతీతంగా పోరాడితేనే విశాఖపట్నం ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను అడ్డుకోగలమని గంటా అన్నారు. విశాఖ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులంతా మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తే పోరాట తీవ్రత కేంద్ర ప్రభుత్వానికి అర్థం అవుతుందన్నారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox