Breaking News

కరోనాతో కన్నుమూసిన మాజీ ఎంపీ సబ్బంహరి

03 rd May 2021, UTC
కరోనాతో కన్నుమూసిన మాజీ ఎంపీ సబ్బంహరి

మాజీ ఎంపీ సబ్బంహరి కరోనాతో కన్నుమూసారు. ఏప్రిల్ 15న సబ్బం హరికి కరోనా సోకడంతో తొలుత ఆయన హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. తరువాత ఆయన విశాఖలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరారు. అనంతరం సబ్బంహరి పరిస్థితి విషమించడంతో వైద్యులు ఆయనను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్సను అందించారు.

1952 లో జన్మించిన సబ్బం హరి  1995 లో విశాఖ మేయర్ గా ఎన్నికయ్యారు. విశాఖ కాంగ్రెస్ కమిటీలో కార్యదర్శిగా.. అనంతరం నగర యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా ఆయన పనిచేసారు. 15వ లోక్‌సభకు అనకాపల్లి ఎంపీగా కాంగ్రెస్ తరపున ఎన్నికయ్యారు.  వైఎస్ జగన్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన తరువాత ఆయనతోనే వున్నారు. తరువాత జగన్ తో విభేదించి బయటకు వచ్చారు.

మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పెట్టిన సమైక్యాంద్ర పార్టీ తరపున విశాఖ నుంచి 2014లో పోటీ చేస్తానని చెప్పి తరువాత విరమించుకున్నారు. 2019లో టీడీపీ తరపున భీమునిపట్నం నియోజక వర్గం నుంచి పోటీ చేసి ఓడి పోయారు. సబ్బం హరి మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంతాపం వ్యక్తం చేసారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox