Breaking News

ఎయిడెడ్‌ విద్యాసంస్థలపై తప్పుడు ప్రచారం మంత్రి ఆదిమూలపు సురేష్

27 th Oct 2021, UTC

ఎయిడెడ్‌ విద్యాసంస్థలను ప్రభుత్వం బలవంతం పెట్టలేదని  ఏపీ విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేశ్ స్పష్టం చేశారు. విద్యాసంస్థల అంగీకారంతోనే ప్రభుత్వం వాటిని తీసుకుందని తెలిపారు. కమిటీ  ఇచ్చిన నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకున్నామని సురేశ్ వెల్లడించారు. విద్యాసంస్థల అభివృద్ధి కోసమే ప్రభుత్వం నిర్ణయాలు  తీసుకుందని .. ఒకవేళ ప్రైవేట్‌ విద్యాసంస్థలు తామే నడుపుకుంటామంటే స్కూళ్లను వెనక్కి తీసుకోవచ్చని మంత్రి పేర్కొన్నారు.

కొన్ని చోట్ల పాఠశాలల్లో కనీస వసతులు లేవని .. తల్లిదండ్రులపై ఎలాంటి బలవంతపు ఒత్తిడి చేయడం లేదని ఆదిమూలపు సురేశ్ అన్నారు. విద్యార్థులకు.. దగ్గరలో ఉన్న స్కూల్స్‌లో చేరేందుకు అవకాశం కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు. దీనిపై కూడా టీడీపీ రాజకీయం చేస్తోందని మంత్రి ఆరోపించారు. గత ప్రభుత్వం ప్రైవేటు విద్యాసంస్థల్లో వసతులు కల్పించకుండా పోస్ట్‌లు ఖాళీగా ఉంచిందని సురేశ్ ఎద్దేవా  చేశారు.ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం చూసి ఓ‍ర్వలేక..  ప్రతిపక్షాలు ప్రభుత్వంపై బురదజల్లే కార్యక్రమాలు చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. తల్లిదండ్రులను అడ్డం పెట్టుకొని  రాజకీయం చేస్తున్నారని.. విద్యార్థుల భవిష్యత్తుతో రాజకీయం చేయడం దుర్మార్గమని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.  

ప్రైవేట్‌ ఎయిడెడ్ విద్యా సంస్థలు ఎలా వచ్చాయో కూడా తెలియని వాళ్లు కూడా మాట్లాడుతున్నారని ప్రతిపక్షాలపై ఆయనమండిపడ్డారు. తమ ప్రభుత్వం.. విద్యా రంగం అభివృద్ధికి సంస్కరణల్లో భాగంగానే చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. రెగ్యులేటరీ కమిషన్ ఫిక్స్ చేసిన ఫీజ్ కంటే అధిక మొత్తం వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. 

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox