Breaking News

భారత్ లో పలుచోట్ల భూ ప్రకంపనలు..!

05 th Jun 2020, UTC
భారత్ లో పలుచోట్ల భూ ప్రకంపనలు..!
 
భారత్ దేశం లో పలు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి... ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఝార్ఖండ్‌తో పాటు పలు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు రావడంతో ఆయా ప్రాంతాల ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఒంగోలు తో సహా పలు ప్రాంతాల్లో ఈ ప్రకంపనలు వచ్చాయి. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శర్మ కళాశాల, అంబేద్కర్‌ భవన్‌ పరిసరాల్లో స్వల్ప ప్రకంపనలు వచ్చి... భూమి కంపించినట్లు అనిపించడం తో.. అక్కడి ప్రజలు భయం తో బయటకు వచ్చారు.
         మరోవైపు...ఝార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌, కర్ణాటకలోని హంపిలో కూడా ఈ ప్రకంపనలు వచ్చాయి... ఝార్ఖండ్‌లో రిక్టర్‌ స్కేలుపై దాని తీవ్రత 4.7గా నమోదయింది..కర్ణాటకలోని హంపిలో వచ్చిన భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 4గా నమోదయింది. ఈ మేరకు అధికారులు ధృవీకరించారు. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox