Breaking News

ఎస్వీబీసీ చైర్మ‌న్‌గా డాక్ట‌ర్ వి.భాస్క‌ర‌సాయికృష్ణ యాచేంద్ర..!

29 th Oct 2020, UTC

ఆంధ్రప్రదేశ్ :తాజాగా ఎస్వీబీసీ చైర్మ‌న్‌గా డాక్ట‌ర్ వి.భాస్క‌ర‌సాయికృష్ణ యాచేంద్రను నియమించారు. జగన్ అధికార వర్గంలో ఇప్పటికే చాలామందికి నామినేటెడ్ పదవులు కట్టబెట్టడంతో పలు విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఎస్వీబీసీ చైర్మ‌న్‌గా డాక్ట‌ర్ వి.భాస్క‌ర‌సాయికృష్ణ యాచేంద్రను ఎంచుకోవడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రెండేళ్ల పాటు ఆయన ఈ పదవి లో కొనసాగనున్నారు. ఈ మేరకు జగన్ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులను విడుదల చేసింది.

డాక్ట‌ర్ వి.భాస్క‌ర‌సాయికృష్ణ శ్రీ‌పొట్టి శ్రీ‌రాములు నెల్లూరు జిల్లా వెంక‌ట‌గిరికి చెందిన వారు ఆయన ప్రపంచ వ్యాప్తంగా సంగీత గేయ‌ధార సృష్టిక‌ర్త‌గా నాలుగువందల ప్రదర్శనలు ఇచ్చారు. సంగీతం, సాహిత్యం, అవ‌ధానం, గానం స‌మ్మిళితం రంగాలలో ఆయనది అందె వేసిన చెయ్యి, చెన్నైలోని వివేకానంద క‌ళాశాల‌లో భాస్క‌ర‌సాయికృష్ణ పియుసి, బిఎ పూర్తి చేశారు. సి.నారాయ‌ణ‌రెడ్డి ఆయనకు పరిచయం అయ్యాక.. ఆయనలో కళా తృష్ణ మరింత పెరిగింది. "క‌విత్ర‌య మ‌హాభార‌తంలో శ్రీ‌కృష్ణ పాత్ర " అనే అంశం పై ఆయన పిహెచ్డి చేశారు. అలాగే తరిగొండ వెంగమాంబ పై ఆయన పరిశోధనలు చేసి పాటలు రచించారు. ఈ పాటలను టీటీడీ ఆధ్వర్యం లోనే సీడీ లుగా రికార్డు చేశారు.  పెద‌తిరుమ‌లాచార్యుల ర‌చ‌న‌లు, గొల్ల‌క‌లాపం వంటి రచనలను కూడా ఆయన సీడీలుగా రూపొందించి అందరి ముందుకు తీసుకొచ్చారు. 

గతంలో ఎస్వీబిసి చైర్మన్ గా సినీ రంగానికి చెందిన వ్యక్తిని నియమించడంతో.. విమర్సలు వ్యక్తమయిన సంగతి విదితమే. ఆ తరువాత పలు దుష్పరిణామాలు చోటు చేసుకున్న నేపధ్యంలో తాజాగా యాచేంద్ర వంటి కళారాధకుడిని ఎస్వీబిసి ఛానల్ కు చైర్మన్ గా నియమించడంతో పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తలు చదవండి

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox