Breaking News

ఏపీలో రాజధాని కొత్త బిల్లు ఇప్పట్లో లేనట్లేనా? KVV SARADHI

24 th Nov 2021, UTC

ఏపీలోని అన్ని ప్రాంతాలను అభివృద్ది చేసేందుకు మూడు రాజధానులను ఏర్పాటు చేస్తున్నట్లు గతంలో అసెంబ్లీలో జగన్‌ ప్రవేశపెట్టారు.  రాజధాని విషయంలో అమరావతికి అన్యాయం జరిగిందని కోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. అంతేకాకుండా రాజధాని రైతులు తిరుమలకు పాదయాత్ర బాట పట్టారు.  విచారణ జరుగుతున్న సమయంలో హఠాత్తుగా జగన్‌ మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకున్నారు. ఈ బిల్లులో న్యాయ పరమైన చిక్కులున్నాయని  వాటన్నింటిని సరిచేసి కొత్త బిల్లును ప్రవేశపెడతామని ప్రభత్వ పెద్దలు చెబుతున్నారు.  అయితే కొత్త బిల్లు ఎప్పుడు వస్తుంది అనే విషయం మాత్రం స్పష్టంగా చెప్పలేదు. అయితే ప్రభుత్వం చెబుతున్నట్లుగా మూడు రాజధానుల కోసం ప్రభుత్వం తీసుకురాబోతున్న కొత్త బిల్లుకు కనీసం ఏడాది పడుతుందని న్యాయనిపుణులు  అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత బిల్లులో ఉన్న కొన్ని సాంకేతిక లోపాలను సరిచేయాలని …  మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకున్నట్లు చెప్పారు.

ఢిల్లీ పెద్దల ఒత్తిడి కారణంగానే మూడు రాజధానుల బిల్లును జగన్ ఉపసంహరించుకున్నారనే ప్రచారాన్ని పార్టీ శ్రేణులు ఖండించాయి. మూడు రాజధానుల బిల్లు ఉపసంహరణకు ఢిల్లీ పెద్దల నుండి ఫోన్ రావటానికి సంబంధమే లేదన్నారు. బిల్లును ఉపసంహరించే విషయంతో పాటు కొత్త బిల్లును తీసుకొచ్చే విషయమై జగన్ న్యాయనిపుణులతో కొద్ది రోజులుగా చర్చిస్తున్నట్లు స్పష్టంచేశారు. ప్రభుత్వం కొత్తగా తీసుకురాబోతున్న బిల్లుకు కనీసం ఏడాది కాలం పట్టే అవకాశాలున్నట్లు కూడా అభిప్రాయపడ్డారు. బిల్లును రూపొందించటంలో ఈసారి అన్నీ కోణాల నుండి చాలా జాగ్రత్తలు తీసుకోవాలని జగన్ గట్టిగా డిసైడ్ అయినట్లు తెలిపారు.  న్యాయనిపుణులు చెప్పిన ప్రకారం చూస్తే ఇప్పట్లో  మూడు రాజధానుల కొత్త బిల్లు వచ్చే అవకాశం లేదని తేలిపోతోంది.

ఇందుకోసం ప్రభుత్వం ఇప్పటికే సీనియర్ న్యాయనిపుణులతో చర్చలు కూడా మొదలుపెట్టిందని అర్ధమవుతోంది. సో జరుగుతున్నదంతా చూస్తుంటే వచ్చే ఎన్నికలకు మూడు రాజధానుల అంశమే కీలకమైన పాయింట్ అవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. 

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox