Breaking News

విద్యాసంస్దల స్దలాల్లో ఇళ్లపట్టాలు ఇవ్వద్దు... ఏపీ సర్కార్ కు హైకోర్టు ఆదేశాలు

19 th Aug 2020, UTC

ఏపీ : వైసీపీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఇళ్ల పట్టాల పంపిణీకి సంబంధించి ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ బడులు, కళాశాలలు, యూనివర్సిటీలకు సంబంధించిన స్థలాల్లో ఇళ్ల పట్టాలు ఇవ్వొద్దంటూ హైకోర్టు మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వైసీపీ సర్కార్‌కు పెద్ద షాక్ తగిలినట్టయింది. తదుపరి విచారణ 8 వారాలకు వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది. విశాఖలోని తిరుమలగిరి గిరిజన పాఠశాల స్థలాన్ని ఇళ్ల పట్టాలుగా ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు స్టే విధించింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఏపీలో ఆగస్టు 15న ఇళ్ల పట్టాలను పంపిణీ చేయాలని ప్రభుత్వం భావించింది. అయితే ఇళ్ల పట్టాల కేటాయింపులో అక్రమాలు జరిగాయని హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలు కావడం, విచారణ ఇంకా కొనసాగుతుండటంతో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం వాయిదా వేసింది. మరిన్ని వార్తలు చదవండి : సీఎం జగన్ చుట్టూ చాల మంది కట్టప్పలు ఎంపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox