Breaking News

ఒ.టి.యస్ పేరుతో పేదలను ఇబ్బందిపెట్టకండి.. సీఎం జగన్ కు ముద్రగడ లేఖ

22 nd Jan 2022, UTC

Sealing letter to CM Jagan:  పేదలు నిర్మించుకున్న ఇళ్లకు ఒటిఎస్ పేరుతో వసూళ్లు తగవంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ్డ పద్మనాభం శనివారం లేఖ రాశారు. ఆయన లేఖ ఈ విధంగా వుంది.గత ప్రభుత్వాలు పేదవారి గృహములకు ఇచ్చిన అప్పులు ఒ.టి.యస్ పేరుతో వసూలు చేయమని అధికారులకు విఫరీతంగా వత్తిడి ఇస్తున్నారండి. అలా వత్తిడి చేయడం ఎంత మాత్రం న్యాయం కాదండి. ఆ రోజున పేదవారికిచ్చిన ఋణాలు కట్టనవసరం ఉండదని వారు భావించడంతోపాటు అప్పటి ప్రజాప్రతినిధులు కూడా ఈ ఋణాలు తప్పని సరిగా కట్టాలని ఎవరూ చెప్పిన సందర్భాలు కూడా లేవండి. అప్పటి ప్రజాప్రతినిధుల జాబితాలో నేను కూడా ఒకడినండి.

1978 నుండి ఉమ్మడి ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఎందరో గౌరవ కలెక్టర్లు నేను అడిగిన ఇళ్ళు శాంక్షను ఇవ్వడమే కాదండి, ఎవరికి ఎక్కడ ఖాళీ స్థలం ఉంటే అదే చోట ఇళ్ళు కట్టుకునే విధానం నేను తీసుకొచ్చానండి. అలాగే స్థోమత కలిగిన వారు రెండు గదులతో పాటు, రెండు వరండాలు కట్టుకునే విధానం కూడా నేను ప్రవేశపెట్టానండి.నేను రాష్ట్రంలోనే అప్పట్లో ఎక్కువ ఇళ్ళు కట్టించానండి.సంసారం అనే సాగరంలో పేదవారు ఎన్నో ఇబ్బందులు పడటంతోపాటు అన్నిరకాల నిత్యావసర వస్తుల ధరలు అందుబాటులో లేకపోవడం, కరోనాతో వారి స్థితిగతులు మారిపోవడం, అప్పులు కట్టలేని నిస్సహాయస్థితిలో కూరుకు పోయారు... పోతున్నారండి.అయ్యా, ఒక విషయం గత ప్రభుత్వంలో ఎన్నో వేల కోట్ల రూపాయలు అభివృద్ధి పనులు వివిధ శాఖల పర్యవేక్షణలో చేసియున్నారండి. గతంలో చేసిన పనులకు తమరు బిల్స్ ఇవ్వకపోవడం న్యాయమేనంటారా? చేసిన పనులకు బిల్స్ రాకపోవడం వల్ల ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు సోషలో మీడియాలో చూపుతున్నారండి. కాని గత ప్రభుత్వంలో కట్టిన వాటికి బిల్లులు ఇవ్వకుండా బిల్డింగులు, రోడ్లు వగైరా తమరి పాలనలో ఉపయోగించుకోవడం న్యాయమవుతుందంటారాండి?

గత ప్రభుత్వంలో చేసిన పనులు తాలూకు బిల్స్ ఇవ్వకూడదని తమరు భావించినప్పుడు, గత ప్రభుత్వాలు ఎన్నో సంవత్సరాల ముందు ఇచ్చిన ఇంటి ఋణాలు వసూలు చేసే అధికారం కూడా మీకు లేనట్టేకదండి? పేదవారిని ఇబ్బంది పెట్టకండి. వారు సంతోషంగా, ఆనందంగా ఉండేలాగ తమరు ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో వారిని చాలా ఇబ్బందులకు గురి చేయడం మంచిగా లేదండి. కొట్టవద్దు అని కోరితే మరోకటి కొట్టు అన్నట్టుగా ఉంది మీ నిర్ణయమని చెప్పుకుంటున్నారండి. దయచేసి ఈ రెండు విషయాలపై సానుభూతి చూపమని కోరుచున్నానండి అంటూ ముద్రగడ్డ లేఖలో పేర్కొన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేష్ వార్తలు చదవండి 

 కృష్ణ విృంద విహారి నుంచి నాగశౌర్య ఫస్ట్ లుక్ రిలీజ్

సంక్రాంతి రేసులో ఏపీఎస్ఆర్టీసీVS టి ఎస్ ఆర్ టి సి

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox