ఆంధ్రప్రదేశ్ : కమ్మకులంలో పుట్టాలని మేం దేవుడిని కోరుకున్నామా? కమ్మవారిగా పుట్టినందుకు బానిసలుగా ఉండాలా? అని టీడీపీ నేత రాజేంద్రప్రసాద్ ప్రశ్నించారు. కమ్మకులంలో పుడితే టార్గెట్ చేయడం మంచిదికాదన్నారు.
వైఎస్ వివేకానందరెడ్డిని ఎవరు హత్య చేశారన్న విషయం కడప, పులివెందుల వాళ్లకు, ప్రజలకు బాగా తెలుసునని అన్నారు. వివేకానంద హత్య జరిగి ఏడాది అయిందని,
జగన్ అధికారంలోకి వచ్చి ఏం చేశారని ప్రశ్నించారు. రమేష్ ఆస్పత్రి వ్యవహారంలో 10 పోలీస్ బృందాలను ఏర్పాటు చేసి అత్యుత్సాహం ప్రదర్శించారని మరి వివేకానంద రెడ్డి విషయంలో ఎందుకు స్పందించలేదని ముఖ్యమంత్రిని ఆయన ప్రశ్నించారు.