ఆంధ్రప్రదేశ్ :నేలతల్లిపై మమకారం చంపుకుని రైతులు భూములిస్తే వారిని అన్యాయం చేస్తారా? అని మాజీ మంత్రి
దేవినేని ఉమ ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యాలయాలు తరలిస్తే మిగిలేది శూన్యమంటున్న రైతుల మాటలు వినబడుతున్నాయా? అని ప్రశ్నించారు.
నేలతల్లిపై మమకారాన్ని చంపుకొని 29వేల రైతు కుటుంబాలు 34వేల ఎకరాల భూములిస్తే అన్యాయం చేస్తారా? ప్రజల జీవనోపాధిని నాశనం చేస్తారా? రాజధాని, హైకోర్టు కేంద్రం పరిధిలోని అంశాలు. అలాంటి చట్టాలు తెస్తే చెల్లుబాటు కావు కార్యాలయాలు తరలిస్తే మిగిలేది శూన్యమంటున్న రైతులమాటలు వినబడుతున్నాయా జగన్ గారూ? అని దేవినేని ఉమ ప్రశ్నించారు.
మరిన్ని వార్తలు చదవండి.