Breaking News

సీఎం జగన్ తండ్రి పేరును చెడగొడుతున్నారు.. సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ

01 st Oct 2020, UTC

ఆంధ్రప్రదేశ్ :ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన తండ్రి రాజశేఖర్ రెడ్డి పేరును చెడగొడుతున్నారని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. కడప జిల్లా తాళ్ళ ప్రొద్దుటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైఎస్ పేరును సమాధి చేయాలని జగన్ చూస్తున్నారని విమర్షించారు. గండికోట నిర్వాసితులు ఉన్న ఫలంగా వెళ్లాలంటే ఎక్కడికి వెళ్తారు. ఏమి తిని బ్రతకాలి. మహిళలు, వృద్దులు ఎక్కడికి వెళ్తారు వారి పరిస్థితి ఏమిటన్న ఇంకిత జ్ఞానం లేదా, అని మండిపడ్డారు. నీటిని నిల్వ ఉంచి జలసమాధి చేస్తారా అని ఆయన ప్రశ్నించారు.

శవాలపై పేలాలు ఎరుకున్న వారిలా ముంపు నిర్వాసితుల నుంచి అధికారులు కమీషన్లు దండుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు.ముంపు వాసుల గోడు సీఎం జగన్, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి పట్టడం లేదన్నారు. గండికోట ముంపు పరిహార చెల్లింపుల్లో ఆర్డీవో  భారీ అవినీతి కి పాల్పడుతున్నారని అన్నారు. ఎక్కువకాలం పదవిలో కొనసాగాలనుకుంటున్న జగన్ నిర్వాసితుల ఉసురు పోసుకోవడం తగదన్నారు. కటాఫ్ డేట్ ను పెంచి అందరికీ పరిహారం అందించాలన్నారు. గ్రామాల్లో వున్న వసతుల కన్నా పది శాతం ఎక్కవగా వసతులు  పునరావాసం కల్పించాకే ఖాళీ చేయించాలన్నారు. కరోనా వైరస్ విస్తరిస్తున్న సమయంలో అందరికీ ఒకచోట పునరావాసం కల్పాంచడమేమిటన్నారు. నిర్వాసితులకు ఇచ్చిన పరిహారం చెక్కులను వెనక్కి తీసుకోవడం తగదన్నారు. ఇంట్లో ఎదిగిన పిల్లలు ఉంటే ఒక్కరికే పరిహారం చెల్లిస్తామనడం సరికాదని వెంటనే స్పందించకపోతే విజయవాడలో ఆందోళనకు దిగుతామని నారాయణ హెచ్చరించారు. మరిన్ని వార్తలు చదవండి. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox