కరోనా మహమ్మారి విస్తృతం గా వ్యాపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమం లో ప్రభుత్వం కూడా ప్రజలను పలు జాగ్రత్తలు పాటించాలని చెబుతొంది. ఈ నేపధ్యం లో శానిటైజర్లను.. మాస్కులను అందరు విరివి గా వాడుతున్నారు. అయితే.. వీటిలో కొన్ని మాస్కులు కేవలం ఒకసారి ధరించి పారవేసేవి గానే ఉంటాయి.. అందరు అది శ్రేయస్కరం అనే ఉద్దేశం తో వాటినే ఎక్కువ గా ఉపయోగిస్తున్నారు.. ఈ నేపధ్యం లో రోడ్డు పై ఎక్కడబడితే అక్కడ ఈ మాస్కులు దర్శనమిస్తున్నాయి..
వీటివల్ల కరోనా వైరస్ మరింత ఎక్కువ గా వ్యాప్తి చెందే అవకాశం ఉంది. ఒకసారి ఉపయోగించిన మాస్క్ లను ఎక్కడ బడితే అక్కడ పడేయడం వలన మరింతగా వ్యాధి వ్యాప్తి జరుగుతుంది.. దీనితో.. వీటిని పడేయడం కోసం ప్రత్యేకం గా చెత్తబుట్టలను తీసుకొచ్చారు.. విజయ వాడ లో పలు చోట్ల ఈ కరోనా చెత్తబుట్టలు దర్శనమిస్తున్నాయి.. ప్రజల లో అవగాహనా పెంచడం కోసం కూడా వీటిని తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.