Breaking News

వచ్చి చూస్తే ఎవరు బలిసి కొట్టుకుంటున్నారో తెలుస్తుంది.. ప్రసన్నకుమార్ రెడ్డికి నిర్మాత ఎన్వీ ప్రసాద్ కౌంటర్

12 th Jan 2022, UTC

 Prasannakumar Reddy:వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు తెలుగు ఫిలిమ్ ఛాంబర్ మాజీ అధ్యక్షుడు, నిర్మాత ఎన్వీ ప్రసాద్ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.  బుధవారం ఆయన తిరుపతిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ మీడియా ముందు మాట్లాడితే హీరో అవుతారని అనుకుంటున్నారు.. అది సరికాదు నల్లపు రెడ్డి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సినిమావాళ్లు బలిసి కొట్టుకుంటున్నారని మాట్లాడారని, ఇది ఆయనకే వర్తిస్తుందని అన్నారు. 

సినిమాలో నటించాలంటే వంద అడుగుల రోప్ కట్టుకుని, రోప్‌పైకి ఎక్కి వంద అడుగులు దూకితే.. ఎవరు బలసి కొట్టుకుంటున్నారో తెలుస్తుందన్నారు. సినిమా నిర్మాణం ఎంత కష్టమో తెలియాలంటే తన సినిమా నిర్మాణం దగ్గరకు ప్రసన్నకుమార్ రెడ్డి వచ్చి చూడాలని పిలుపునిచ్చారు. తాను 10 రోజులు ఆతిధ్యం ఇస్తానని వచ్చి చూస్తే తెలుస్తుందన్నారు. ప్రసన్నకుమార్ రెడ్డి తండ్రి అంటే తమకు ఎంతో గౌరవం వుందని,  తమకు సంస్కారం ఉందని అందుకే ఎక్కువగా మాట్లాడటం లేదన్నారు.

ప్రసన్నకుమార్ రెడ్డి   రాజకీయ జీవితం ఏంటో కోవూరులో అందరికీ తెలిసిందేనని ఎన్వీ ప్రసాద్ అన్నారు.  ఏపీ ప్రభుత్వం జీవో తీసుకు వచ్చినది మొదలు తాము ఎన్నో ధపాలు ప్రభుత్వంతో చర్చలు జరపామని ఆయన అన్నారు. ఈ  సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు సరికావని  ప్రసాద్ అన్నారు.

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox