Breaking News

ప్రతి పేదవాడికి న్యాయం జరగాలనేదే ప్రభుత్వ లక్ష్యం.. సీఎం జగన్

13 th May 2022, UTC

Konaseema: ప్రతి పేదవాడికి న్యాయం జరగాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం జగన్ స్పష్టంచేశారు. కొనసీమ జిల్లాలోని జరిగిన వైఎస్సార్ మత్స్యకార భరోసా కార్యక్రమంలో సీఎం  పాల్గొన్నారు. 1లక్ష 8వేల 755 మత్స్యకార కుటుంబాలకు 109 కోట్లు జమ చేశామని తెలిపారు. పేదల కోసం 32 పథకాలు అమలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు.

మరోవైపు, గత ప్రభుత్వం హాయం పై విరుచుకుపడ్డారు. చంద్రబాబు పాలనలో  మత్య్సకారులను పట్టించుకోలేదని మండిపడ్డారు. గత ప్రభుత్వ పాలనకు మన ప్రభుత్వ పాలనకు తేడా ఉందన్నారు. గతంలో కొంతమందికి మాత్రమే పరిహారం అందేదని, అర్హులందరికీ మత్స్యకార భరోసా అందిస్తున్నామని సీఎం తెలిపారు. గత ప్రభుత్వ కాలంలో 12వేల కుటుంబాలకు మాత్రమే పరిహారం అందించారని చెప్పారు. చంద్రబాబు ఐదేళ్లలో ఇచ్చింది కేవలం 104 కోట్లయితే, మన ప్రభుత్వంలో ఏడాదికి 109 కోట్లు ఇస్తున్నామని స్పష్టంచేశారు. 

మంచి చేశామని మనలా చెప్పే ధైర్యం చంద్రబాబుకు లేదు. చంద్రబాబు చేశాడని చెప్పే ధైర్యం దత్తపుత్రుడితో పాటు ఎల్లోమీడియాకు కూడా లేదు. నిజాయితీ నిబద్ధతతో ప్రజల ముందుకు వస్తున్నాం. దుష్ట చతుష్టయం అంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, చంద్రబాబు. నలుగురికి తోడు వీరి దత్తపుత్రుడు. మంచి చేస్తున్న ప్రభుత్వాన్ని వీరు జీర్ణించుకోలేరు. ఏదైనా వ్యాధికి ఆరోగ్యశ్రీలో చికిత్స చేయించుకోవచ్చు. కానీ ఈర్ష్య, కడుపు మంటకు వైద్యం లేదు. కొడుక్కి పచ్చి అబద్ధాలు, మోసాలతో ట్రైనింగ్‌ ఇస్తున్న చంద్రబాబు లాంటి తండ్రిని ఎక్కడైనా చూశారా? కోర్టుకి వెళ్లి మంచి పనులు అడ్డుకునే ప్రతిపక్షాన్నిఎక్కడైనా చూశారా? పరీక్షల పేపర్లు వీళ్లే లీక్‌ చేస్తారు. పేపర్‌ లీక్‌ను సమర్థించిన ప్రతిపక్షాన్ని ఎక్కడైనా చూశారా? ఈఎస్‌ఐలో డబ్బులు కొట్టేసిన నాయకుడిని విచారించడానికి వీల్లేదనే ప్రతిపక్షం, ఎల్లోమీడియాను ఎక్కడైనా చూశారా? ప్రజలకు మంచి జరిగితే ఇలాంటి రాబందులకు అసలు నచ్చదంటూ  సీఎం జగన్ మండిపడ్డారు.

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox