Breaking News

ఫిషింగ్‌ హార్బర్ల శంకుస్థాపన చేసిన సీఎం జగన్!

21 st Nov 2020, UTC

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తాజాగా మత్స్యకారుల కోసం మరో సంక్షేమ పధకానికి శ్రీకారం చుట్టారు. నేడు ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా మత్స్యకారుల కోసం అంతర్జాతీయ మౌలిక సదుపాయాలతో కూడిన ప్రాజెక్ట్ ను జగన్ సర్కార్ ప్రారంభించింది. ఈ ప్రాజెక్ట్ తొలి విడతలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా ఉప్పాడ, , కృష్ణా జిల్లా మచిలీపట్నం, గుంటూరు జిల్లా నిజాంపట్నం, నెల్లూరు జిల్లా జువ్వలదిన్నెలలో నాలుగు ఫిషింగ్ హార్బర్లను నిర్మించనున్నారు. కాగా, ఇందుకోసం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి వర్చువల్ గా శంకుస్థాపన చేసారు. 

ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, ఆంధ్ర ప్రదేశ్ కు 974 కిలోమీటర్ల మేర తీరప్రాంతం ఉందన్నారు. ఇంత తీర ప్రాంతం ఉన్న మత్స్యకారుల జీవితాలు దయనీయంగా ఉన్నాయని అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో సరైన సౌకర్యాలు లేకపోవడంతోనే మత్స్య కారులు గుజరాత్ లాంటి ప్రాంతాలకు వలస వెళ్లారన్నారు. పెద్ద సముద్రం ఉన్నప్పటికీ, ఫిషింగ్ హార్బర్ ల కొరత ఉందని సీఎం జగన్ పేర్కొన్నారు. భారత్ లో అతిపెద్ద సముద్ర తీరం ఉన్న ప్రాంతాల్లో ఆంధ్ర ప్రదేశ్ రెండవ స్థానం లో ఉందని పేర్కొన్నారు.

మొత్తం ఎనిమిది ఫిషింగ్ హార్బర్ల ఏర్పాటుకు కనీసం మూడు వేలకోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుందని తెలిపారు. అయితే, రూ.1,510 కోట్లతో ప్రస్తుతం నాలుగు ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపడుతున్నామని సీఎం జగన్ వివరించారు. నియోజకవర్గానికి ఒక ఆక్వా హబ్‌  చొప్పున ఏర్పాటు చేస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. ఇందుకోసం, 225 కోట్లు ఖర్చు పెట్టి మొదట పాతిక ఆక్వా హబ్ ల నిర్మాణము చేపడతామని తెలిపారు.

మచిలీపట్నం, రామాయపట్నం, భావనపాడులో మరో 3 పోర్టుల నిర్మాణం చేపట్టడానికి కూడా యోచిస్తున్నామని తెలిపారు. వేట నిషేధ సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆదాయం కోల్పోయిన మత్స్య కారుల కుటుంబాలకు రూ.10వేలు చొప్పున లక్షా 2వేల 337 కుటుంబాలకు  ఆర్ధిక సాయం చేశామని సీఎం జగన్ గుర్తు చేసారు. వేట చేస్తున్న సమయంలో ఒకవేళ మత్స్యకారులు ప్రమాదవశాత్తు చనిపోతే,  మత్స్యకారులకు అందించే పరిహారాన్ని ఐదు లక్షల నుంచి, పది లక్షలకు పెంచామని తెలిపారు. ఆక్వా రైతులకు కరెంట్ ను యూనిట్ రూపాయిన్నరకే అందిస్తున్నామని తెలిపారు. ఆక్వా లాబ్ లను కూడా ఏర్పాటు చేసినట్లు సీఎం జగన్ తెలిపారు. అలానే, వెస్ట్ గోదావరి జిల్లాలో ఫిషరీస్ విశ్వ విద్యాలయం ఏర్పాటు చేయడానికి ఆర్డినెన్స్ ను తీసుకొచ్చామని తెలిపారు. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox