Breaking News

వినూత్నంగా పోలీస్ యాప్, ఆంధ్రప్రదేశ్ లో అందరు డౌన్లోడ్ చేసుకోవాలి

21 st Sep 2020, UTC

ఆంధ్రప్రదేశ్ :నేడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి 'ఏపీ పోలీస్ సేవ' యాప్ ను ప్రారంభించారు. ఆయన తాడేపల్లి లోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ అప్లికేషన్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన పోలీస్ ల గురించి మాట్లాడారు. " పోలీసులు అంటే భయపడొద్దన్నారు. వారిని సేవకులుగా ప్రజలు భావించాలన్నారు. పోలీస్ సేవలను ప్రజలకు మరింత చేరువగా తీసుకొచ్చేందుకే, ఈ కొత్త అప్లికేషన్ ను తీసుకొచ్చామన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ దిశగా అడుగులు వేస్తున్నామని" సీఎం జగన్ చెప్పుకొచ్చారు.

'ఏపీ పోలీస్ సేవ' యాప్ మీ మొబైల్ లో ఉంటె పోలిసుల వద్దకు వెళ్లాల్సిన అవసరం తగ్గిస్తుందన్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో ఉండే ప్రతి ఒక్కరు ఈ అప్లికేషన్ ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. దర్యాప్తు పురోగతి, అరెస్ట్ లు, ఎఫ్ఐఆర్ లు, రికవరీలు, రహదారి భద్రత, సైబర్ సెక్యూరిటీ, మహిళా భద్రత, కార్యక్రమాలకు అనుమతులు, ఎన్ఓసీలు, లైసెన్సులు, పాస్ పోర్టు సేవలు, వివిధ రకాల వెరిఫికేషన్లు ఇలా అన్ని పోలీస్ సేవలకు ఏకైక పరిష్కారం "పోలీస్ సేవ యాప్"

ఇలాంటి అప్లికేషన్ ను ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా తీసుకొస్తున్నామని తెలిపారు. దాదాపు 87 రకాల పోలీస్ సేవలను ఈ యాప్ ద్వారా అందిస్తున్నామని తెలిపారు. పోలీస్ స్టేషన్లకు వెళ్లే పరిస్థితులను తగ్గిస్తూ, పోలీసులు అందించే భిన్న రకాల సేవలను ఒకే వేదికపైకి తీసుకొచ్చేందుకే ఈ అప్లికేషన్ ను లాంచ్ చేస్తున్నామని అన్నారు. ఇలాంటి అప్లికేషన్ ను తీసుకువచ్చినందుకు ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖకు జగన్ అభినందనలు తెలిపారు. మరిన్ని వార్తలు చదవండి. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox