వైసీపీ నాయకుడు కవల కృష్ణమూర్తికి, దళిత యువకుడికి జరిగిన ఘర్షణ లో యువకుడి కి పోలీసులు శిరోముండనం చేసిన ఘటన రాష్ట్రము లో సంచలనం సృష్టించింది. ఈ ఘటన జరగడానికి ముందు ఓ ఇసుక లారీ యువకుడిని ఢీకొనడం తో వారిద్దరికీ మధ్య గొడవ జరిగింది. ఈ గొడవ జరుగుతున్నా సమయం లో కృష్ణమూర్తి కారు అక్కడకి వచ్చింది. దీనితో..అక్కడ వివాదం మరింత ముదిరింది. ర్యాంపు నుంచి అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీలను పట్టుకోవడం ఈ గొడవ జరిగిందని అక్కడి వారు భావిస్తున్నారు.
రాజానగరం ఎమ్మె ల్యే అక్రమ ఇసుక లారీలను పట్టుకుంటే యాభై వేలు బహుమతి ఉంటుందని ప్రకటించారు. దీనితో.. అక్కడి వారు ఇసుక లారీలను పట్టుకునే పనిలో పడ్డారు. ఈ నేపధ్యం లో ఈ ఘర్షణ జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. మండలంలోని కాటవరం, మునికూడలి, వెదుళ్లపల్లి, రఘుదేవపురం, ముగ్గుళ్ళ గ్రామాల్లో ఇసుక రాంపులు ఉన్నాయి.. అక్కడ నుంచి అక్రమ ఇసుక రవాణా విస్తృతం గా సాగుతోంది. కొన్ని ఆన్ లైన్ బుకింగ్ ద్వారా వెళుతున్నా.. మరి కొన్ని ప్రభుత్వ ఇసుక స్టాక్పాయింట్లకు వెళుతున్నాయి. అయితే.. ఇందులో అక్రమాలు ఎక్కువ జరుగుతున్నాయని తెలుస్తోంది.
ఈ క్రమం లో యువకుడి కి వైసీపీ నాయకుడు కవల కృష్ణమూర్తి ఘర్షణ చెలరేగింది. అయితే.. ఈ ఘటన లో పోలీసులు యువకుడి పట్ల అమానుషం గా వ్యవహరించారు. ఆ యువకుడి కి పోలీసులు శిరోముండనం చేసారు.. దీనిపై ఏపీ డిజిపి కూడా ఫైర్ అయ్యారు. తాజాగా.. సీఎం జగన్ కూడా ఈ ఘటన పట్ల ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ ఘటనకు బాధ్యులైన సిబ్బందిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మరోసారి ఇలాంటివి జరగరాదని స్పష్టం చేశారు. డిజిపి సవాంగ్ వెంటనే చర్యలు తీసుకున్నారు. ఒక ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు. వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని డిజిపి సవాంగ్ తెలిపారు.