Breaking News

జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ ఆగష్టు 25 కు వాయిదా

30 th Jul 2021, UTC

Politics: జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌ పై విచారణను సీబీఐ కోర్టు ఆగస్టు 25కు వాయిదా వేసింది. అదేరోజు తీర్పు వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీనికి సంబంధించి ఎంపీ రఘురామకృష్ణ రాజు మీడియాతో మాట్లాడుతూ సీబీఐ కోర్టులో నేడు జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దుపై విచారణ జరిగిందన్నారు. నెల క్రితం ఉన్న పరిస్థితినే సీబీఐ అంగీరకరించినందుకు సీబీఐకి ధన్యవాదాలు తెలియజేశారు. ఆగస్ట్ 25 వరకు న్యాయం కోరుకునే వారు ఉత్కంఠతో ఎదురుచూడాల్సిందే అని అన్నారు.

 తమ వాదనలన్నీ స్పష్టంగా వినిపించామని, రాతపుర్వకంగా కూడా ఇచ్చినట్లు చెప్పారు. అందరం ఆశావాదంగా ఉందామని, నిరాశ చెందవలసిన అవసరం లేదని అన్నారు. న్యాయం జరుగుతుందనే ఆశాభావంతో ఉన్నామని తెలిపారు. విదేశాలకు పారిపోయేందుకు A2 చూస్తున్నారని వ్యాఖ్యానించారు. రెండో రోజుల్లో విజయసాయిరెడ్డి బెయిల్‌ను కూడా రద్దు చేయాలని  పిటిషన్ వేయనున్నట్లు ఎంపీ రఘురామకృష్ణం రాజు వెల్లడించారు. 

11 చార్జిషీట్లలో ఏ1 ఉన్న జగన్ బెయిల్‌ను రద్దు చేయాలని కోర్టులో రఘురామ పిటిషన్ దాఖలు చేశారు. ఆయన సీఎం పదవిని అడ్డుపెట్టుకుని కేసులను నీరుగారుస్తూ, సాక్షులను ప్రలోభాలకు గురిచేస్తూ నిబంధనలకు విరుద్ధంగా వ్యహరిస్తున్నారని అందువల్ల బెయిల్ రద్దు చేయాలని హైదరాబాద్ నాంపల్లిలోని సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రఘురామ పిటిషన్‌ పై కోర్టులో విచారణ జరుగుతోంది. కేసుకు సంబంధించి ఈరోజు సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. కోర్టు విచక్షణ అధికారాలకే నిర్ణయం వదిలేసామంటూ దాఖలు చేసిన మెమోను పరిగణలోకి తీసుకోవాలంటూ కోర్టును సీబీఐ కోరింది. మరిన్ని వార్తలు చదవండి 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox