Breaking News

ఢిల్లీకి చేరిన సీఎం జగన్.. అమిత్ షాతో భేటీ..!

20 th Jan 2021, UTC

ఢిల్లీ :గత రాత్రి సీఎం జగన్ ఢిల్లీకి చేరుకున్నారు. పార్టీ ఎంపీలు విజయసాయిరెడ్డి, అవినాశ్ రెడ్డి, మిథున్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలు కూడా సీఎం జగన్ తో ఢిల్లీకి చేరుకున్నారని సమాచారం. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సీఎం జగన్ భేటీ సమావేశమయ్యారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలపైనే చర్చించారు. సీఎం జగన్, మరియు వైసీపీ ఎంపీల ఢిల్లీ పర్యటన వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టతను ఇచ్చారు.

ప్రత్యేక హోదా, కేంద్రం ఇవ్వాల్సిన బకాయిలు, అలాగే పోలవరం ప్రాజెక్ట్ కు సంబంధించిన అంశాలను చర్చించడానికి సీఎం జగన్ ఢిల్లీకి వెళ్లారని రామకృష్ణ రెడ్డి వివరించారు. ఈ సందర్భంగా హై కోర్ట్ విభజన అంశాన్ని కూడా చర్చించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇన్ సైడర్ ట్రేడింగ్ వ్యవహారం గురించి స్పందిస్తూ.. కిలారి రాజేశ్ కేసు ఓ చిన్న విషయం మాత్రమే అని అన్నారు. అందులో ఇన్ వాల్వ్ అయిన పెద్దలు కూడా బయటపడతారన్నారు. మరిన్ని వార్తలు చదవండి 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox