Breaking News

శ్రీవారి సేవలో సీఎం జగన్

11 th Oct 2021, UTC
శ్రీవారి సేవలో సీఎం జగన్

తిరుమల శ్రీవారిని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం  దర్శించుకున్నారు.  శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. గరుడ వాహన సేవలో సీఎం పాల్గొన్నారు. ముఖ్యమంత్రికి వేద పండితులు ఆశీర్వచనాలు ఇచ్చారు. తిరుపతి, తిరుమలలో పర్యటిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌.. పలు అభివృద్ధి కార్యక్రమాలను  ప్రారంభించారు.

అంతకుముందు సీఎం జగన్  తిరుపతి బర్డ్‌ ఆసుపత్రిలో శ్రీపద్మావతి చిన్న పిల్లల కార్డియాక్‌ సెంటర్‌ను ప్రారంభించారు. అనంతరం అలిపిరి వద్దకు చేరుకున్న  జగన్‌.. శ్రీవారి పాదాల వద్ద నుంచి తిరుమలకు నడక మార్గం, పై కప్పును, గోమందిరాన్ని ప్రారంభించారు. అక్కడ నుంచి తిరుమల చేరుకున్న  జగన్‌కు పద్మావతి అతిథి గృహం వద్ద టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో, మంత్రులు స్వాగతం పలికారు. అనంతరం బేడి ఆంజనేయ స్వామిని సీఎం  జగన్ దర్శించుకున్నారు. 

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox