విజయవాడ స్వర్ణ పాలస్ హోటల్లో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై సీఎం ఆరా తీశారు.. బాధితులను ఆదుకునేందుకు తక్షణ చర్యలకు ఆదేశం ఇచ్చారు.. కాగా.. రమేష్ ఆసుపత్రి వారు లీజుకు తీసుకున్న హోటల్లో ప్రమాదం జరిగిందని అధికారులు సీఎం జగన్ కు వివరణ ఇచ్చారు. అయితే.. ఆ హోటల్ లో
ఇందులో కరోనా పేషెంట్లను పెట్టారని అధికారులు సీఎం జగన్ కు తెలిపారు.
స్వర్ణ పాలస్ హోటల్లో జరిగిన ప్రమాద ఘటపై సీఎం శ్రీ వైయస్.జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద కారణాలపై ఆరా తీశారు. ఘటన వివరాలను సీఎంఓ అధికారులు సీఎంకు వివరించారు. ఒక ప్రైవేటు ఆస్పత్రి ఈ హోటల్‌ను లీజుకు తీసుకుందని, అందులో కరోనా వైరస్ సోకిన పేషెంట్లను పెట్టినట్టుగా ప్రాథమిక విచారణలో వెల్లడైందని సీఎంఓ అధికారులు సీఎంకు వెల్లడించారు. ఈ ప్రమాదానికి గురైన వారికి మెరుగైన వైద్య సేవలు అందేలా తక్షణ చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశాలు జారీచేశారు. ఘటనపై లోతుగా విచారణ జరపాలని, ఘటన పూర్వాపరాలను తనకు నివేదించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.