Breaking News

సీఎం జగన్ ను కలుస్తున్న చిరంజీవి..!

05 th Jun 2020, UTC
సీఎం జగన్ ను కలుస్తున్న చిరంజీవి..!
కరోనా మహమ్మారి కారణం గా తెలుగు చిత్ర సీమ తీవ్ర నష్టాల్లో కూరుకుపోయిన సంగతి తెలిసిందే.  లాక్‌డౌన్ అమల్లోకి రావడంతో సినిమా షూటింగులకు బ్రేక్ పడగా అప్పటికే షూటింగులు పూర్తి చేసుకుని ల్యాబ్‌కు చేరిన ఆయా సినిమాల ప్యాచ్‌ వర్క్స్‌ కూడా నిలిచిపోయాయి. తాజాగా.. లాక్ డౌన్ ఆంక్షలు సడలించిన నేపధ్యం లో తిరిగి షూటింగ్స్ చేసుకోవడానికి చిత్ర పరిశ్రమ సిద్ధం అవుతోంది. ఈ నేపధ్యం లోనే.. సినీ పెద్దలు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ తో భేటీ జరిపిన సంగతి తెలిసిందే. ఆపై.. సీఎం కెసిఆర్ తో కూడా చిరంజీవి సహా.. పలువురు పెద్దలు చర్చించారు. 
             తాజాగా.. వీరు ఆంధ్ర సీఎం జగన్ ను కూడా కలవనున్నారు. షూటింగ్‌కు అనుమతుల కోసం.. సీఎం జగన్ ను కలువనున్నారు. అదే సమయంలో పెండింగ్‌లో ఉన్న నంది అవార్డుల విషయం కూడా సీఎం దృష్టికి తీసుకురానున్నట్లు సమాచారం. సినిమా హాళ్ల ఓపెనింగ్, సినీ కార్మికులు, పరిశ్రమలకు రాయితీలు, ప్రోత్సాహకాలపై చర్చించనుట్లు సమాచారం. దీనిపై గతంలో ఒకసారి గుర్తుచేయగా చిరంజీవినే ఆ బాధ్యత తీసుకోవాలని జగన్ సూచించారు. ఇక ఈ వారంలో జరగబోయే తాజా భేటీపై ఇటు సినీ అభిమానులు అటు మెగా అభిమానులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox