చిన్న పిల్లల అక్రమ రవాణా దందా ఇటీవల విశాఖ లో వెలుగు చూసింది. ఓ కేసు నమోదు అవడం తో పోలీసులు దీనిపై దృష్టి సారించారు.. ఓ ప్రైవేట్ ఆసుపత్రి కేంద్రం గా ఈ అక్రమ రవాణా జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా ఈ కేసుకు సంబంధించి విషయాలను వెల్లడించారు.. పోలీసుల వివరాల ప్రకారం.. విశాఖ లో సృష్టి ఆసుపత్రి కేంద్రం గా ఈ దందా నడుస్తోంది.
పేదవాళ్లను లక్ష్యంగా చేసుకుని పసిబిడ్డల అక్రమరవాణా జరుగుతోందని, ఇందులో సృష్టి ఆసుపత్రి ఎండీ నమ్రత ప్రధాన నిందితురాలని పోలీస్ కమీషనర్ తెలిపారు. ఈ విషయం పై గతనెలలో సుందరమ్మ అనే వ్యక్తి ఫిర్యాదు చేసారు. ఆమె ప్రసవించాక బిడ్డను కోల్ కతాలో ఉన్నవారికి అమ్మేశారని సీపీ వివరించారు. దీని వెనుక సృష్టి ఆసుపత్రి హస్తం ఉందని... ఈ కేసులో 8 మందిని నిందితులుగా చేర్చామని సిపి వివరించారు. ఈ పసిపిల్లల అక్రమ రవాణా కేసులో ఇద్దరు ఆశా వర్కర్ల ప్రమేయం కూడా ఉందని ఆర్కే మీనా తెలిపారు. కాగా.. నిందితులలో ఇప్పటి వరుకు ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసారు.