చంద్రబాబు నాయుడు ప్రధానిని తిట్టిన నోటితోనే పొగిడారు... విజయసాయి రెడ్డి
19 th Aug 2020, UTC
ఆంధ్ర ప్రదేశ్ : వైఎస్సార్సీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా చంద్రబాబుపై బుధవారం వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పార్టీ వ్యవహారాలను కొడుకుకు అప్పగించాలని బాబు గారు అనుకుంటున్నారా? వయసు పెరగడం, జ్ఞాపకశక్తి క్షీణించడంతో కుమారుడికి పగ్గాలు ఇస్తారంట. కరోనా ఉధృతి తగ్గగానే లోకేశ్ నాయుడును కాబోయే సీఎంగా ఎలివేట్ చేసేలా సైకిల్ యాత్ర చేయించాలని ఎల్లో మీడియా ముఖ్యులు రూట్ మ్యాప్ ఇచ్చారంట అంటూ ఎద్దేవా చేశారు.
మరో ట్వీట్లో ' బాబు నాయుడు ప్రధానిని, ఆయన కుటుంబాన్ని తిట్టిన నోటితోనే ఆయన నాయకత్వాన్ని పొగిడారు. సీబీఐ, ఈడీ, ఐటీ, ఎన్ఐఏ ఏపీలోకి రావటానికి వీల్లేదన్న నోటితోనే కేంద్ర ప్రభుత్వ విచారణ కావాలంటున్నారు. ఇంకా ఇలాంటి చిత్ర విచిత్రాలు, విడ్డూరాలు ఎన్ని చూడాలో మరి..!' అంటూ విమర్శించారు. మరిన్ని వార్తలు చదవండి( ఎర్రన్నాయుడు ప్రాధేయపడ్డా ఏ పోస్టు దక్కకుండా చేసాడు:విజయసాయి రెడ్డి )