ఆంధ్రప్రదేశ్ : చంద్రబాబునాయుడు కమ్మ వాళ్లను భ్రష్టు పట్టిస్తున్నాడని ఏ సమస్య వచ్చినా దానికి కులం రంగు పూయడం అతనికి అలవాటైందని అని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ మండిపడ్డారు. ఐదు నెలల్లో నాలుగు రోజులు మాత్రమే రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు మతి భ్రమించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఆయన ఫోన్‌ను ట్యాప్ చేయాల్సిన అవసరం ఎవ్వరికి లేదన్నారు.
70 లక్షల మంది కమ్మ వాళ్లపై ఎవరు కక్ష సాధిస్తారని దేవినేని ఉమ మాటలకు అర్దం లేదన్నారు. నాపై, మీపై ఎవరైనా కక్ష సాధిస్తున్నారా? తప్పు చేసినప్పుడు కేసు పెడితే కక్ష సాధింపు ఎలా అవుతుంది? రమేష్ హాస్పటల్స్ఆరోగ్యశ్రీ బిల్లులు మొత్తం ఇచ్చినప్పుడు జగన్మోహన్రెడ్డి మంచితనం కనపడలేదా? అని ఆయన ప్రశ్నించారు.
రమేష్ ఆసుపత్రిలో ఉచితంగా వైద్యం చేశారా? లక్షలకు లక్షలు ఫీజులు తీసుకుని, కరోనా లేని వారిని కూడా హోటల్లోని కోవిడ్ సెంటర్లో పెట్టారు. ఇలాంటి ఆసుపత్రులపై తెలంగాణ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంది. కానీ అక్కడ బాబు, లోకేష్ నోరు పెగలదని ఆయన విమర్శించారు. విశాఖలోని ఎల్జీ పాలిమర్స్‌లో ప్రమాదం జరిగాక కేసులు పెట్టారు. వారిని అరెస్టు చేయాలని చంద్రబాబు రోజూ ప్రెసిడెంట్‌కు, పీఎంకు లేఖలు రాశారు. మీ ఆసుపత్రిలో పది మంది ప్రాణాలు పోయి, కేసు పెట్టాల్సి వచ్చినప్పుడు కులం కనపడుతుందంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు.
మరిన్ని వార్తలు చదవండి (
హీరో రామ్ కు చంద్రబాబు మద్దతు )