Breaking News

"దిశ" చట్టం పై చంద్రబాబు కౌంటర్ లు..!

20 th Jul 2020, UTC
 
దేశం ఎంత అభివృద్ధి చెందుతున్న అమ్మాయిలపై అత్యాచారాలు.. అమానుష సంఘటనలు మాత్రం ఆగడం లేదు.. ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా.. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న పువ్వులాంటి ఆడపిల్లలని కాపాడలేకపోతున్నాం.. దేశమంతా ఓ వైపు మహమ్మారి తో పోరాడుతున్న సమయం లో కూడా అత్యాచారాలు జరుగుతుండడాన్ని దేనికి సంకేతం గా భావించాలి..? సందు దొరికితే చాలు మృగాళ్లు తెగబడుతున్నారు.. ఇటీవల వరుస గా అత్యాచారాల కేసులు నమోదు అయినా సంగతి తెలిసిందే. రాజమహేంద్ర వరం లోను.. చిత్తూరు జిల్లా యేర్పేడు మండలంలో..నెల్లూరు, అనంతపురం, ఇలా పలు చోట్ల అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. వెలుగు లోకి వచ్చిన వి తెలుస్తున్న.. అసలు వెలుగు లోకి రాకుండా ఉన్నవి ఎన్ని ఉన్నాయో కూడా తెలియదు.
 
       ఆడపిల్లలను రక్షించడం కోసమే "దిశా" అనే కొత్త చట్టాన్ని వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ల ద్వారా నిందితులకు త్వరగా శిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అయినప్పటికీ నేరస్తులతో భయం లేదు సరికదా అత్యాచారాలకు తెగబడుతున్నారు.. ఈ విషయమై నారా చంద్రబాబు నాయుడు ట్విట్టర్ లో వరుస ట్వీట్ లతో స్పందించారు.  "దిశ" చట్టం చేసేశామని కోట్ల ప్రజాధనంతో ప్రచారం చేసుకున్న ప్రభుత్వం... అమలులో ఆ చట్టానికి దిక్కు లేకుండా చేసింది. మహిళలకు రక్షణ కల్పించాలన్న చిత్తశుద్ధి, నిబద్దత ప్రభుత్వానికి ఉంటే ఈ వరుస అత్యాచారాలు ఎందుకు జరుగుతాయి? " అని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. 
 
             "రాజమహేంద్రవరంలో ఒక మైనర్ దళిత బాలికను 4 రోజులపాటు నిర్బంధించి, చిత్రహింసలు పెట్టి, సామూహిక అత్యాచారానికి పాల్పడి... చివరికి నిందితులే బాధిత బాలికను పోలీస్ స్టేషన్ వద్ద వదిలేసి... పోలీసులనే సవాల్ చేసారంటే... రాష్ట్రంలో నేరగాళ్లు ఎంతగా పేట్రేగిపోతున్నారో చూడండి. " అంటూ ఆయన ఆవేదన చెందారు. "చిత్తూరు జిల్లా యేర్పేడు మండలంలో దళిత బాలిక, నెల్లూరు జిల్లా వెంకట్రావుపల్లెలో మరో బాలిక, అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఇంకో దళిత బాలిక, గుంటూరులో ముస్లిం బాలిక, నెల్లూరులో మరో మహిళపై అత్యాచారాలు.. ఇప్పుడీ దళిత మైనర్ బాలిక. 14నెలల్లో 400పైగా అత్యాచారాలు, 16గ్యాంగ్ రేప్ లు.. " అంటూ ఆయన వరుస ట్వీట్ లు చేసారు. 
 
         "నెల్లూరులో మహిళా ఎంపిడివోపై, చిత్తూరులో దళిత మహిళా డాక్టర్ పై దౌర్జన్యాలు, మాస్క్ పెట్టుకోమన్న మహిళా ఉద్యోగిని పై ప్రభుత్వ కార్యాలయంలోనే భౌతికదాడి,...ఇవన్నీ ఏపీలో మహిళలపై అరాచకాలకు పరాకాష్ట? " అని చంద్రబాబు నాయుడు తన ట్వీట్ లో పేర్కొన్నారు. "పాలకులు స్వప్రయోజనాల కోసం వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తే.  దాని దుష్ఫలితాలు ఇలాగే ఉంటాయి.ఇప్పటికైనా నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలి. బాధితులకు న్యాయం చేయాలి. బడుగు బలహీన వర్గాల పేదల ధన, మాన, ప్రాణాలకు రక్షణ కల్పించాలి"  అంటూ చంద్రబాబు నాయుడు డిమాండ్ చేసారు. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox