Breaking News

నా బాల్య స్నేహితుడి జయంతి అంటూ చంద్రబాబు ట్వీట్..!

10 th Jun 2020, UTC

టీడీపీ అధినేత చంద్రబాబు తన బాల్య స్నేహితుడి పుట్టినరోజు సందర్భంగా ఎమోషనల్ ట్వీట్ చేశారు. టీడీపీకి, ప్రజలకు ఆయన చేసిన సేవల్ని స్మరించుకున్నారు. ‘తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ పార్లమెంటు సభ్యులు, రంగస్థల మరియు సినీ నటుడు, దర్శకుడు.. అన్నిటినీ మించి నా బాల్యస్నేహితుడు, హితుడు అయిన కీ.శే. డాక్టర్ ఎన్. శివప్రసాద్ జయంతి సందర్భంగా... ప్రజలకు ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకుంటూ.. శివప్రసాద్ స్మృతికి నివాళులర్పిస్తున్నాను’అంటూ ట్వీట్ చేశారు.

 టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కూడా ట్వీట్ చేశారు. ‘వైద్యం, రంగస్థలం, సినీరంగం, రాజకీయం...ఇలా విభిన్న రంగాలలో తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నారు తెలుగుదేశం నేత, మాజీ ఎంపీ, కీ.శే.ఎన్.శివప్రసాద్ గారు. ఈరోజు శివప్రసాద్ గారి జయంతి సందర్భంగా.. ఎమ్మెల్లేగా, మంత్రిగా, ఎంపీగా ప్రజలకు, పార్టీకి వారు చేసిన సేవలను స్మరించుకుందాం’అన్నారు.

శివప్రసాద్ టీడీపీలో సీనియర్ నేతగా ఉన్నారు.. అలాగే చిత్తూరు ఎంపీగా రెండుసార్లు విజయం సాధించారు. గతేడాది అనారోగ్య కారణాలతో చనిపోయారు. ఆయన చంద్రబాబుకు కూడా బాల్య స్నేహితుడు.. డాక్టర్‌గా, సినీ నటుడిగా మంచి పేరు కూడా తెచ్చుకున్నారు. ప్రముఖ నటి, వైసీపీ ఎమ్మెల్యే రోజాను సినిమాలకు పరిచయం చేసింది శివప్రసాదే. రాజకీయాల్లో కూడా మంచి గుర్తింపు వచ్చిది.

సమైక్యాంధ్ర, ప్రత్యేక హోదా ఉద్యమాల్లో శివప్రసాద్ తన దైన తరహాలో నిరసన తెలిపే వారు. రోజుకో రకం వేషం ధరించి ఆయన నిరసన తెలిపే తీరు పార్లమెంట్ లో అందరినీ ఆకట్టుకునేది. శివప్రసాద్ ఈ రోజు ఏ వేషం ధరిస్తారు అనే క్యూరియాసిటీ  ఎంపీలందరికీ వుండేది. వినూత్నమైన వేషాలతో నిరసనలు తెలిపి అందర్ని ఆకట్టుకున్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox