Breaking News

వివేకా హత్య కేసు లో కొనసాగుతున్న విచారణ..!

24 th Jul 2020, UTC

వైసీపీ పార్టీ మాజీ మంత్రి, వై ఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు వై ఎస్ వివేకా అనుమానాస్పదం గా హత్య చేయబడ్డ సంగతి విదితమే.. అయితే.. ఈ కేసు ఇంకా మిస్టరీ గానే ఉంది.. ఈ కేసు ఇప్పటికే సీబీఐ కి అప్పగించారు.. వై ఎస్ వివేకా హత్య వెనుక గల కారణాలేంటో సీబీఐ విచారణ జరిపిస్తోంది.. నేడు మరో కీలక మలుపు తిరగనుంది.
 
                   మాజీ మంత్రి వివేకా హత్య కేసుపై వరుసగా ఏడవ రోజు సీబీఐ విచారణ కొనసాగుతోంది.. నిన్నటి నుంచి  సీబీఐ సాంకేతిక నిపుణుల  బృందం రంగం లోకి దిగి విచారణ చేపడుతోంది. సిట్ అధికారులు సేకరించిన ఫోన్ కాల్ డేటాను సీబీఐ సాంకేతిక నిపుణుల బృందం పరిశీలిస్తోంది. మాజీ మంత్రి వివేకా హత్య కు గురైన క్షణం నుంచి ఉదయం వరకు జరిగిన పోన్ కాల్ సంబాషణలపై ఈ బృందం ప్రత్యేక ద్రృష్టి సారించింది.. దివంగత మంత్రి వివేకా హత్యకు ముందు ఎవరెవరితో ఫోన్ లో మాట్లాడారో సీబీఐ వివరాలు సేకరిస్తోంది.
 
          ఇప్పటికే  వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులు తాజాగా సాంకేతిక బృందం సాయం తీసుకుంటున్నారు. ఈ కేసులో విచారణ నిమిత్తం సీబీఐ అధికారులు వాచ్ మెన్ రంగయ్యను డిఎస్పీ కార్యాలయానికి పిలిపించారు. మరికాసేపట్లో..సీబీఐ బృందం రంగయ్యను విచారించనుంది. విచారణలో రంగయ్య వెల్లడించే అంశాలను బట్టి కీలక వ్యక్తులను అనుమానితులను విచారించాలని సిబిఐ భావిస్తోంది. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox