Breaking News

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ ఛార్జీషీట్

27 th Oct 2021, UTC

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో  సీబీఐ ఛార్జీషీట్ దాఖలు చేసింది.  వివేకా హత్యలో గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమా శంకర్ రెడ్డి, దస్తగిరిలపై అభియోగాలను మోపింది. ఈ ఏడాది ఆగష్టు, సెప్టెంబర్ మాసాల్లో నిందితులను అరెస్ట్ చేశామని సీబీఐ ఛార్జీషీట్ లో తెలిపింది. అయితే నిందితులకు కోర్టు బెయిల్ మంజూరు చేసిందని సీబీఐ అధికారులు వివరించారు.  సునీల్ యాదవ్ ను ఆగష్టు 4వ తేదీన గోవాలో సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు.  ఆ తర్వాత ఆయనను జ్యుడిషీయల్ రిమాండ్ కు తరలించారు. అయితే 90 రోజుల వ్యవధిలో ఛార్జీషీట్ దాఖలు చేయాలి. నవంబర్ 4వ తేదీతో 90 రోజులు పూర్తి కానుండటంతె  సీబీఐ ఛార్జీషీట్ దాఖలు చేసింది.

2019 మార్చి 14వ తేదీ రాత్రి వైఎస్ వివేకానందరెడ్డిని  ఇంట్లోనే దుండగులు హత్య చేశారు. ఎన్నికలకు ముందు ఈ ఘటన చోటు చేసుకొంది. ఈ విషయమై అప్పటి చంద్రబాబునాయుడు సర్కార్ సిట్ విచారణ నిర్వహించింది. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడ సిట్ విచారణ నిర్వహించింది. 

అయితే   అసలు దోషులను పట్టుకోవాలని కోరుతూ వైఎస్ వివేకానందరెడ్డి కూతురు వైఎస్ సునీత సహా మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి తదితరులు ఏపీ హైకోర్టులో సీబీఐ విచారణ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై విచారణ నిర్వహించిన హైకోర్టు వివేకానందరెడ్డి హత్యపై  సీబీఐ విచారణకు ఆదేశాలు జారీ చేసింది.

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox