Breaking News

ఏపీ రాజధానులపై.. ప్రజా తీర్పు...!

16 th Aug 2020, UTC
ఏపీ రాజధానులపై..  ప్రజా తీర్పు...!
ఏపీలో మూడు రాజధానుల నిర్ణయంతో రైతుల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైంది. రాజధాని ప్రాంత రైతులు... ఎక్కడికక్కడ ధర్నాలు, ఆందోళనలు కొనసాగిస్తూనే ఉన్నారు. శిబిరాలు ఏర్పాటు చేసి నిరసన తెలుపుతున్నారు.  ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెంటనే వెనక్కి తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మూడు చోట్ల రాజధాని నిర్ణయం వల్ల, మూడు ప్రాంతాలు అభివృద్ధిలో దూసుకుపోతాయని మరికొందరు భావిస్తున్నారు . ఈ నేపథ్యంలో... మూడు రాజధానుల నిర్ణయంపై రాష్ట్రవ్యాప్తంగా ప్రైమ్9 నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో.. పలువురు తమ అభిప్రాయాలను పంచుకున్నారు . అదేవిధంగా , ఆన్ లైన్ వేదికగా ప్రైమ్9 జరిపిన పోల్ కూడా ముగిసింది .   మరి సర్వేలో ఒకరాజధానిని ఎంతమంది సమర్ధించారు? మూడు రాజధానులకు ఎంతమంది అనుకూలంగా ఉన్నారు ? ఏపీ ప్రజల నాడి ఎలా ఉంది? 
.
ఏపీ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయంపై... అటు అమరావతి ప్రాంత రైతులే కాకుండా...ఇతర జిల్లాలవారు కూడా వ్యతిరేకిస్తున్నారు. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా ఎలా నిర్ణయించారో అర్థంకావడంలేదని కొంతమంది అంటుండగా... వాతావరణ పరంగా ఆలోచిస్తే.. పొల్యూషన్‌లో విశాఖ రెండో స్థానంలో ఉందని... అసౌకర్యానికి గురి చేసే ఈ ప్రాంతాన్ని పరిపాలనా రాజధానిగా పెట్టడం హర్షించదగ్గ విషయంకాదని  అంటున్నారు. విశాఖలో రాజధాని పెట్టినంత మాత్రాన... ఉత్తరాంధ్ర అభివృద్ధి జరగదని   అంటున్నారు. దేశానికి ఒక్కటే రాజధాని ఉన్నప్పుడు... అన్ని రాష్ట్రాలకు ఒకే రాజధాని ఉన్నప్పుడు... ఏపీకి మాత్రం ఎందుకు 3రాజధానులు ఉండాలని ప్రశ్నిస్తున్నారు.
ఇదిలా ఉంటే... రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపడాన్ని చీకటి రోజుగా భావిస్తున్నామని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు . గతంలో చంద్రబాబు అమరావతి ప్రాంత రైతులను మోసం చేసినట్లు.. వైసీపీ ప్రభుత్వం కూడా... మోసం చేయడానికే.. మూడు రాజధానుల అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చిందని  చెబుతున్నారు .
 
అయితే ,  మూడు రాజధానులు ఉంటేనే రాష్ట్రమంతటా అభివృద్ధి జరుగుతుందని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు .
 
ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి మూడు రాజధానుల ప్రతిపాదన చేసిన నాటి నుంచి - రాష్ట్రంలో రాజకీయాల స్వరూపం మారిపోయింది. మూడు రాజధానుల వెనుక అన్నిపార్టీలు - తమతమ ప్రయోజనాలను వెతుక్కుంటున్నాయి. ప్రజల ఆకాంక్షల సంగతేమోగానీ - ఆయా పార్టీలకు ఒనగూరే ఉపయోగం ఏమిటన్న దానిపైనే ఫోకస్‌ పెడుతున్నాయి. ఈ ప్రతిపాదన వెనుక సహజంగానే అధికార వైసీపీ తన ప్రయోజనాలను చూసుకుంటుంది. జగన్ వేసిన ఎత్తుకు బలికాకుండా ఇతర పార్టీలు జాగ్రత్త పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రకరకాల వ్యూహాలను వేస్తూ ముందుకు సాగుతున్నాయి . ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ వంటి పార్టీలు ఇప్పుడు ఇదే పనిలో ఉన్నాయి.
రాజకీయ పార్టీల రాష్ట్ర నేతలంతా రాజధానుల మార్పు, విశాఖకు ఎగ్జిక్యూటివ్‌ హోదాను దాదాపుగా వ్యతిరేకిస్తున్నారు. అమరావతిలో సాగుతోన్న ఉద్యమాలకు మద్దతు కూడా ఇస్తున్నారు. 
ప్రధాన ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ మూడు రాజధానుల వ్యవహారంలో చేస్తున్న రాజకీయం - తొలినుండీ ఆసక్తికరంగానే ఉంది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఒక రాష్ట్రం - ఒక రాజధాని అంటూ గతంలో ఉద్యమం కూడా చేసారు . ఆయన పార్టికి చెందిన విశాఖ జిల్లా నేతలు మాత్రం విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా చేయాలన్న సీఎం జగన్‌ నిర్ణయం మంచిదేనని, ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఓ తీర్మానం కూడా చేసిన సంగతి రహస్యమేమీ కాదు .
ఇదంతా గమనిస్తున్న ప్రజలు మాత్రం.. అదేంటి పార్టీ అధినేత వ్యతిరేకించడమేంటి ? విశాఖ తెలుగు తమ్ముళ్లు స్వాగతించడం ఏంటి? ఇదంతా రాజకీయమే అంటూ అప్పట్లో సోషల్ మీడియాలో హల్ చల్ చేసారు . స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో విశాఖ రాజధాని ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ఉత్తరాంధ్ర అంతటా దెబ్బ తినే ప్రమాదం ఉందని గ్రహించే తెలుగుదేశం పార్టీ ఈ గేమ్ ఆడుతోందని అప్పట్లో పోస్టింగులు పెట్టారు . ఇక , అమరావతి మార్పుపై బీజేపీ ఇప్పటి వరకు స్పష్టమైన వైఖరిని వెల్లడించలేదు.  ఏపీ రాజధాని విషయంలో కేంద్రం ఒకటి చెప్తోంటే - బీజేపీ నేతలు ఎవరికి తోచిన కామెంట్లు వారు   చేస్తున్నారు . అటు , జనసేన పరిస్థితి కూడా మిగతా పార్టీలకు విభిన్నంగా ఏమీ లేదు. ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మూడు రాజధానులపై మండిపడుతున్నారు. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా వ్యతిరేకించడం గానీ, స్వాగతించడం గానీ ఆ పార్టీ నేతలు చేయడం లేదు. అమరావతి రైతులకు న్యాయం చేయాలన్నదే - తొలినుండీ జనసేన అజెండాగా కనిపిస్తోంది. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌ను స్వాగతిస్తే మిగతా ప్రాంతాల్లో నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. పవన్ అభిమాన వర్గాల్లో కూడా చీలిక వచ్చే ప్రమాదం ఉందని గ్రహించారు. అందుకే రాజధానుల వ్యవహారం కాకుండా అమరావతి రైతులకు అన్యాయం చేయకూడదన్న పాయింట్‌ మీదే జనసేన పోరాటం సాగిస్తోంది . 
 
ఏపీ రాజ‌ధానుల‌పై ఏపీలో ఎడతెగని చ‌ర్చ కొన‌సాగుతూనే ఉంది... స్వాతంత్ర్య వేడుక‌ల్లోనూ మూడు రాజ‌ధానుల వ్య‌వ‌హారం, ఏపీకి ప్ర‌త్యేక హోదా విష‌యంపై మాట్లాడారు ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి. విజయవాడలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుక‌ల్లో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్క‌రించిన ఆయ‌న‌.. అనంతరం గౌరవ వందనం స్వీకరించారు. ఇక‌, ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. రాజ్యాంగం, చట్టప్రకారం నడుచుకుంటేనే అభివృద్ది సాధ్యమని.. అధికార వికేంద్రకరణ జరగకపోతే సమన్యాయం పుస్తకాలకే పరిమితం అవుతుందంటూ ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. అన్ని జిల్లాలు స‌మానంగా అభివృద్ది సాధించాలని ఆకాంక్షించారు. ఇక‌, సమన్యాయం కోసం పాలనా వికేంద్రీకరణ చేస్తున్నామ‌ని.. రాష్ట్ర విభజనతో అయిన గాయాలు మానాలన్నా.. అలాంటి గాయాలు లేకుండా జాగ్రత్త పడాలన్నా - రాష్ట్రంలో మూడు ప్రాంతాలకు సమన్యాయం జరగాలన్నా.. వికేంద్రీకరణ సరైనదని నిర్ణ‌యించామ‌ని స్ప‌ష్టం చేశారు. మూడు ప్రాంతాలకు సమన్యాయం జరిగేలా మూడు రాజధానుల బిల్లుని చట్టంగా మార్చామ‌ని వెల్ల‌డించారు సీఎం వైఎస్ జ‌గ‌న్
 
ఇక , రాష్ట్రమంతటా ... ఏపీ రాజధానుల వ్యవహారంపై తీవ్ర చర్చ సాగుతున్న సందర్భంలోనే - ప్రైమ్9 ప్రజాభిప్రాయ సేకరణకు పూనుకుంది . అటు, ఆన్ లైన్ వేదికగా ప్రైమ్9 జరిపిన సర్వేలో ఆసక్తికర ఫలితాలు వెలువడ్డాయి .  ఫేస్బుక్ , ట్విట్టర్ , యూ ట్యూబ్ , వాట్సాప్ , ప్రైమ్9 ఓన్ వెబ్ సైట్ లు వేదికగా .... పోల్ నిర్వహించాం . సర్వేలో లక్షలాది మంది పాల్గొని, తమ అభిప్రాయాలను వ్యక్తం చేసారు . వాట్సాప్ లో 48 శాతం మంది ఒక్కరాజధానికి మద్దతు తెలుపగా .... 49 శాతం మంది మూడు రాజధానులకు అనుకూలంగా ఓటేశారు . 3 పర్సెంట్ మంది చెప్పలేం అన్నారు .   ఫేస్ బుక్ లో ఒక రాజధానికి అనుకూలంగా  62 శాతం అంగీకారం తెలుపగా - 38 శాతం మంది మూడు రాజధానులు కావాలన్నారు . 
ఇక , యూట్యూబ్ లో 31 శాతం మంది ఒక్క రాజధాని కావాలంటే - 68 శాతం మంది మూడు రాజధానులకే మొగ్గుచూపారు . ట్విట్టర్ లో మాత్రం ఒక రాజధానే ఉండాలని 49 శాతం మంది అభిప్రాయపడగా-  మూడు రాజధానులు కావాలని 49 శాతం మంది కోరారు . రెండు శాతం మంది చెప్పలేం అన్నారు . ఇక ప్రైమ్9 న్యూస్ ఓన్ వెబ్ సైట్ లో 82 శాతం మంది ఒక రాజధానికి మద్దతు తెలుపగా , 16 శాతం మంది మూడు రాజధానులకు ఓకె  చెప్పారు . 2 శాతం మంది ఏమీ చెప్పలేం అన్నారు . 
ఓవరాల్ గా యావరేజ్ చూస్తే - 54 శాతం మంది ఒక రాజధానికే మొగ్గు చూపగా - 44 శాతం మంది మూడు రాజధానులు కావాలన్నారు . 2 శాతం మంది ఎటూ తేల్చలేదు .
ఇక , ఇవీ ప్రైమ్9 న్యూస్ నిర్వహించిన పోల్ రిజల్ట్స్ . ఏపీ రాజధానుల వ్యవహారం కోర్టుల్లో నానుతుండగా - మరి , ప్రభుత్వం మూడు రాజధానులపై ఏవిధంగా ముందుకు వెళ్తుందో అన్నది వేచి చూడాల్సిందే . 

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox