Breaking News

రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు..!

20 th Jul 2020, UTC

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము లో మంత్రి వర్గ విస్తరణ పై సర్వత్రా ఆసక్తి నెలకొన్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు.. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు అయింది.  ఈ నెల 22న మధ్యాహ్నం ఒంటిగంట తర్వాత మంత్రివర్గ విస్తరణ  ఉంటుందని తెలుస్తోంది... అదే రోజున ఇద్దరు కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారట.. ఇటీవల మోపిదేవి, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ రాజీనామా చేసిన సంగతి అందరికి తెలిసిందే... 
           అయితే.. వారి స్థానం లో తిరిగి ఆ సామాజిక వర్గానికి చెందిన వారినే మంత్రులుగా  నియమించే అవకాశం ఉండొచ్చని తెలుస్తోంది. రామచంద్రాపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, పలాస ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజుకు ఈసారి మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తూ.గో. జిల్లాలో శెట్టి బలిజ సామాజిక వర్గానికి చెందిన వేణుగోపాలకృష్ణ..పలాస ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజుకు మంత్రి పదవి దక్కే అవకాశం ఉన్నట్లు సమాచారం. 
          శ్రీకాకుళం జిల్లా మత్స్య కార కుటుంబానికి చెందిన పలాస ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు, మంత్రివర్గ సభ్యుల పేర్లను ప్రభుత్వం రేపు అధికారికం గా ప్రకటించబోతోంది. మంత్రులు మోపిదేవి, పిల్లి సుభాష్ చంద్రబోస్ స్థానంలో ఇద్దరు కొత్త మంత్రులకు అవకాశం ఉంటుంది.. మిగిలిన మంత్రి వర్గ శాఖల్లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని భావిస్తున్నారు. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox