Breaking News

విజయసాయి రెడ్డి పై బీజేపీ నేతల ట్వీట్లు..!

20 th Jul 2020, UTC

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ  పై  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  ఎంపీ  విజయసాయి రెడ్డి చేసిన ట్వీట్ కు కౌంటర్ గా బీజేపీ నాయకులు ట్వీట్లు చేసారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చంద్రబాబు కోవర్టని మళ్లీ అర్థమైంది. సొంత పార్టీ అభిప్రాయానికి భిన్నంగా చంద్రబాబుకు అనుకూలంగా రాజధాని బిల్లును ఆమోదించొద్దని గవర్నర్‌కు లేఖ రాశాడు. ఈ ముసుగు ఇంకెన్నాళ్లు?’ అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

ఈ ట్వీట్‌కు  బీజేపీ నేత లంకా దినకర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘కొన్ని జీవితాలకు ఎప్పటికీ బుద్ధిరాదు. ఎంపీ రఘురామరాజు ఏదోఒకటి మాట్లాడినప్పుడల్లా ఈయన ఏదో వేషం వేస్తుంటాడు.. అందులో ఈ రోజు అమావాస్య కొంత అసలు వేషం బయటకు వచ్చింది. అసలు చంద్రబాబు తొత్తు ఆయనే.. జగన్‌పై కక్షపట్టి పిచ్చి సలహాలిస్తూ చెడ్డపేరు తెస్తున్నాడు’ అని కౌంటరిచ్చారు

మరో వైపు  బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు రామ్ కుమార్  కూడ ట్విట్టర్ వేదికగా విజయసాయికి కౌంటర్ ఇచ్చారు. రాజధాని అంశంపై గవర్నర్‌కు కన్నా లేఖ రాయడాన్ని పార్టీ అధిష్ఠానం తప్పుబట్టిందన్న విజయసాయి ట్వీట్‌ స్క్రీన్ షాట్‌ను అప్‌లోడ్ చేస్తూ.. మా పార్టీలో ఉన్న కోవర్టు ఎవడో కానీ నీకు తప్పుడు సమాచారం ఇచ్చి.. ఎర్రి పప్పను చేశాడు అని  వ్యాఖ్యానించారు. ఇవన్నీ తప్పుడు కథనాలు అంటూ విజయసాయి ట్వీట్‌కు కేంద్ర పార్టీ సమాధానమిదేనని ఆయన ట్వీట్ చేశారు. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox